హైదరాబాద్ : రామోజీకి చుక్కలు కనబడుతున్నాయా ?

Vijayaతాను రాసిందే వార్త,  చెప్పిందే నిజం, ప్రభుత్వానికి తాను ఎంత చెబితే అంతే అన్నట్లుగా వ్యవహరించిన మార్గదర్శి, ఈనాడు మీడియా గ్రూపు ఛైర్మన్ రామోజీరావుకు చుక్కలు కనబడుతున్నట్లున్నాయి.  చెరుకూరి రామోజీరావుతో పాటు ఆయన కోడలు మార్గదర్శి ఎండీ చెరుకూరి శైలజను సీఐడీ విచారించింది. జూబ్లీహిల్స్ లోని శైలజ ఇంటికి మూడు బృందాలతో కూడిన 23 మంది సీఐడీ అధికారులు సోమవారం ఉదయం వెళ్ళారు.మామ, కోడలు ఇద్దరినీ సీఐడీ అధికారులు విచారించారు. తన గ్రూపు సంస్ధల పనితీరుపై ఎవరైనా అనుమానాలు వ్యక్తంచేసినా రామోజీ సహించేవారు కాదట. ఎందుకంటే 2019 వరకు ఉన్న ప్రభుత్వాలన్నీ రామోజీకి అనుకూలంగానే  వ్యవహరించాయి. రామోజీ సంస్ధల్లో అన్యాయలు, అక్రమాలు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతున్నా వాటిజోలికి వెళ్ళేందుకు కూడా సాహించలేదు.అలాంటి పరిస్ధితుల నుండి ఇపుడు రామోజీ సీఐడీ విచారణకు కూర్చోవాల్సొచ్చింది. ఇదంతా కేవలం జగన్మోహన్ రెడ్డి కారణంగా మాత్రమే జరిగిందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జగన్ అంటేనే ఒళ్ళంతా కారం రాసుకున్నట్లుగా రామోజీ పూనకాలతో పూర్తి వ్యతిరేక వార్తలు రాస్తున్నారు. ఉన్నవీ లేనివి కల్పించటమే కాకుండా ఎప్పట్టెప్పటి విషయాలనో తవ్వి బయటకు తీసి మరీ బ్యానర్ కథనాలిస్తున్నారు. దాంతో జగన్ కు కూడా మండింది. చంద్రబాబునాయుడు ప్రయోజనాల కోసమే తనపై పూర్తి వ్యతిరేకంగా వార్తలు, కథనాలు రాస్తున్న రామోజీని ఒక చూపు చూడాలని అనుకున్నారు. దాని ఫలితమే మార్గదర్శిపైన కేసులు, అరెస్టులు, విచారణలు.మార్గదర్శి చిట్ ఫండ్స్ వ్యాపారమే అక్రమమని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చాలా ఏళ్ళుగా మొత్తుకుంటున్నారు. రిజర్వ్ బ్యాంక్ చట్టానికి వ్యతిరేకంగా రామోజీ అక్రమ వ్యాపారం చేయటమే కాకుండా కోర్టులను కూడా తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇక్కడ విషయం ఏమిటంటే తనలోనే బొచ్చెడు బొక్కలున్నపుడు  ఎదుటివాళ్ళ బొక్కలగురించి మాట్లాడకూడదనే జ్ఞానం ఉండాలి. మనం గాజుగదిలో కూర్చుని బయటవాళ్ళపైన రాళ్ళేస్తే ఏమవుతుంది మన గాజు కూడా విరుగుతుంది. ఈ విచక్షణ కోల్పోయిన కారణంగానే ఇపుడు రామోజీ సీఐడీ విచారణను ఎదుర్కోవాల్సొచ్చింది. ఇపుడు విచారణకు కూర్చున్న రామోజీకి రేపేమవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: