ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయం... వైసీపీకి నష్టమా ? ఎలా ?

VAMSI
తాజాగా ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో ఉపాధ్యాయ ఎమ్మెల్యే లను వైసీపీ బలపరిచిన అభ్యర్థులు గెలుచుకోగా , పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో మాత్రం ఏపీలో ప్రతిపక్ష పార్టీగా ఉన్న టీడీపీ బలపరిచిన అభ్యర్థులు విజయదుందుభి మోగించారు. మొత్తం మూడు పాతబద్రుల స్థానానికి ఎన్నిక జరగగా మూడింటినీ టీడీపీ అభ్యర్థులు గెలుచుకున్నారు. దీనితో రాష్ట్రంలో ఇది సంచలనంగా మారింది. టీడీపీ నాయకులు, కార్యకర్తలు మరియు మద్దతుదారులు ఈ ఫలితాలను ఆధారంగా చేసుకుని అధికార వైసీపీని దారుణంగా విమర్శిస్తున్నారు.
వైసీపీ పని ఇక అయిపోయింది... జగన్ పాలన సరిగా లేదు కాబట్టే పట్టభద్రులు టీడీపీకి పట్టం కట్టారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. వాస్తవానికి ఏపీలో ఎప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినా దాదాపుగా టీడీపీనే విజయం వరిస్తుంది. ఈ విషయం తెలుసుకోవాలంటే ఒకసారి గతం నుండి చూసుకుంటే క్లియర్ గా అర్ధమవుతుంది. ఇప్పుడు కూడా అదే జరిగింది. అయితే ఇంతకు ముందు పిడిఎఫ్ బలపరిచే అభ్యర్థులు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో కీలకంగా ఉండేది. కానీ ఇప్పుడు పిడిఎఫ్ కూడా టీడీపీకి సపోర్ట్ చేయడంతో వారి విజయానికి మార్గం సులువు అయింది.
పైగా వైసీపీ ప్రభుత్వం తీసుకు వచ్చిన సంక్షేమ పధకాల లభ్ది పొందివారిలో ఈ ఎన్నికల్లో ఓటేసిన వారు ఎక్కువగా లేకపోవడం కూడా ప్రధాన కారణం. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వానికి అండదండగా నిలిచే మహిళలు , గ్రామీణ ప్రాంత ప్రజలు మాత్రమే అని చెప్పాలి. వీరు ఈ ఎన్నికలో ఓటు వేయడానికి అవకాశం లేదు కాబట్టి వైసీపీ ఓటమి చెందింది. వచ్చే సంవత్సరం జరగనున్న ఎన్నికల్లో ఈ పరిస్థితి ఉండే ఛాన్స్ లేదు. ఇప్పుడు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వచ్చే ఎన్నికలను ఏమాత్రం ప్రభావితం చేయలేవు అన్నది వాస్తవం. అంతే కాకుండా టీడీపీ నాయకులు అంటున్నట్లుగా పట్టభద్రుల ఎన్నికలలో టీడీపీ విజయం వైసీపీకి నష్టం కాదు.  
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: