అమరావతి : బీసీ నేతను బకరాను చేశారా ?

Vijaya
తెలుగుదేశంపార్టీలో బీసీ నేతను చంద్రబాబునాయుడు బకరాను చేశారు. అధికారంలో ఉన్నపుడు ఎక్కువ పోస్టులను తన సామాజికవర్గం వాళ్ళకు, డబ్బున్న వాళ్ళకే ఇచ్చిన చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నపుడు మాత్రం ఎస్సీ,  బీసీలను రంగంలోకి దింపుతుండటమే విచిత్రంగా ఉంది. రాజ్యసభ ఎంపీగా ఎస్సీ నేతైన వర్ల రామయ్యను దింపి గబ్బుపట్టించారు. ఇపుడు ఎంఎల్ఏ కోటాలో ఎంపికవ్వాల్సిన ఎంఎల్సీ స్ధానానికి బీసీ నేతైన పంచుమర్తి అనూరాధను రంగంలోకి దింపారు. సోమవారం మధ్యాహ్నం పంచుమర్తి నామినేషన్ వేశారు.ఇక్కడ గమనించాల్సిందేమంటే అప్పట్లో వర్ల నామినేషన్ వేసినా ఇపుడు పంచుమర్తి నామినేషన్ వేసినా గెలుపు అవకాశాలు ఏమాత్రం లేవు. వీళ్ళ ఓటమి ఖాయమని తెలిసే వీళ్ళని చంద్రబాబు పోటీలోకి దింపుతున్నారు. నామినేషన్ వేస్తే గెలుపు గ్యారెంటీ అన్నపుడేమో సుజనాచౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, గరికపాటి మోహన్ రావు, కనకమేడల రవీంద్ర లాంటి వాళ్ళని రాజ్యసభకు పంపారు. అప్పట్లో ఒక బీసీని కానీ ఎస్సీ నేతను కానీ రాజ్యసభకు పంపాలని చంద్రబాబు అనుకోలేదు.అలాగే అధికారంలో ఉన్నపుడు శాసనమండలి సభ్యులుగా నారా లోకేష్, యనమల రామకృష్ణుడు, బచ్చుల అర్జునుడు, దీపక్ రెడ్డి బీద రవిచంద్రయాదవ్ లాంటి వాళ్ళని నామినేట్ చేశారు. ఇపుడు పోటీచేసినా గెలుపు అవకాశాలు ఏమాత్రం లేదని తెలిసీ పంచుమర్తిని పోటీలోకి దింపుతున్నారు. ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డి ఏమో ఎక్కడెక్కడ బీసీలు, ఎస్సీలను వెతికి మరీ బయటకు తీసుకొచ్చి నామినేషన్లు వేయించారు.అంటే ఇక్కడ చంద్రబాబు ఉద్దేశ్యం స్పష్టంగా అర్ధమైపోతోంది. అవకాశం ఉన్నపుడేమో తన సామాజికవర్గం+డబ్బులున్న ఆసాములను ఎంపికచేస్తున్నారు. గెలుపు అవకాశం లేనపుడేమో పెద్దగా బలంలేని వాళ్ళని దింపి గబ్బుపట్టిస్తున్నారు. ఇలాంటి వాళ్ళని పోటీలోకి దింపి గబ్బుపట్టించటం కన్నా అసలు పోటీకి దూరంగా ఉంటేనే మర్యాదగా ఉంటుంది. మరి చంద్రబాబుకు ఈ విషయం తెలీకే పోటీలోకి దింపుతున్నారా అంటే అదేంకాదు వాళ్ళని గబ్బు పట్టించదలచుకున్నారు పోటీలోకి దింపుతున్నారంతే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: