హైదరాబాద్ : లిక్కర్ స్కామ్ లో కవిత బుక్కయినట్లేనా ?

Vijaya




ఇపుడందరి కళ్ళు కల్వకుంట్ల కవితపైనే కేంద్రీకృమయ్యుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ను విచారిస్తున్న సీబీఐ, ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఉన్నతాధికారులు సోమవారం రామచంద్రపిళ్ళైని అరెస్టు చేశారు. స్కాం బయటపడిన దగ్గర నుండి పాత్రదారులు, సూత్రదారుల్లో పిళ్ళై పేరు ప్రముఖంగానే వినిపిస్తోంది. ఇప్పటివరకు ఈ స్కామ్ లో 11 మందిని దర్యాప్తుసంస్ధలు అరెస్టు చేసినట్లయ్యింది.



ఇప్పటికే పిళ్ళైని వివిధ సందర్భాల్లో ఈడీ విచారించింది. చార్జిషీట్లో పేరు కూడా చేర్చింది. అయితే ఇంతకాలం విచారణకు మాత్రమే పరిమితమైన ఉన్నతాధికారులు హఠాత్తుగా పిళ్ళైని అరెస్టుచేయటం ఆశ్చర్యమేసింది. ఇప్పటికే ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ శిసోడియా, మాగుంట రాఘవరెడ్డి, శరత్ చంద్రారెడ్డి లాంటి ప్రముఖులను అరెస్టుచేసిన విషయం తెలిసిందే. సో, దర్యాప్తులో భాగంగా ఈడీ  అరెస్టుచేయనిది కల్వకుంట్ల కవితను మాత్రమే.



కవితను కూడా ఈడీ అరెస్టు చేయబోతోందని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఆమె కూడా అరెస్టుకు మానసికంగా సిద్ధమైపోయినట్లే ఉన్నారు. ఈమధ్యనే ఒక ఇంటర్వ్యూలో కవిత మాట్లాడుతు తనను దర్యాప్తు సంస్ధలు అరెస్టు చేస్తే బెయిల్ మీద బయటకు వచ్చి జనాల ముందుకు వెళతానని చెప్పారు. జరిగిన విషయాలను జనాలకు చెప్పుకోవటం తప్ప తనకు మరో ఆప్షన్ లేదన్నారు. అంటే ఏదోరోజు తన అరెస్టు కూడా తప్పదని కవిత రెడీగానే ఉన్నట్లు అర్ధమైపోతోంది. ఎందుకంటే అరెస్టయిన పిళ్ళై తాను కవిత ప్రతినిధిగా వ్యవహరించినట్లు అంగీకరించారట.



లిక్కర్ స్కామ్ మొత్తం మహా ఉంటే రు. 300 కోట్లు కూడా ఉండదు. కానీ ఇందులో ఇన్వాలైన వ్యక్తులే అత్యంత ప్రముఖులు. అందుకనే ఈ స్కామ్  ఇంత సంచలనంగా మారింది. ఒకవైపేమో కేంద్రప్రభుత్వం ప్రతిపక్ష నేతలపై కక్షసాధింపులకు దిగుతోందంటు కేజ్రీవాల్, కేసీయార్ లాంటివాళ్ళు గోలచేస్తున్నారు. అయితే స్కామ్ లో తమ వాళ్ళ ప్రమేయం లేదని మాత్రం గట్టిగా చెప్పటంలేదు. పైకి స్కామ్ లో తమకేమీ సంబంధంలేదని అంటున్నా బయటపడుతున్న ఆధారాలను చూస్తే అందరి పాత్ర బాగానే ఉన్నట్లు అర్ధమవుతోంది. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: