విజయప్రియ నిత్యానంద ఎవరు? పూర్తి వివరాలివే?

Purushottham Vinay
2019లో లైంగిక వేధింపుల కేసు నుంచి తనను తాను తప్పించుకోడానికి భారత్ నుంచి నిత్యానంద పరారయ్యాడు. కొన్నాళ్లు అతడు ఎక్కడున్నాడో తెలియలేదు. కానీ ఆ సంవత్సరం చివర్లో ఓ దేశాన్ని సృష్టించాడు. దాని పేరే.. ''కైలాస''. హిందువులు ఎంతో భక్తితో కొలిచే శివుడి నెలవైన కైలాసాన్ని ఏకంగా ఆ దేశానికి పేరుగా ప్రకటించాడు. ఇక యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస (యూఎస్ కే) దీని పూర్తి పేరు. దీన్ని సౌత్ అమెరికాలోని ఈక్వేడార్ నుంచి  తన భక్తుల సాయంతో కొనుగోలు చేశానని తెలిపాడు.తాజాగా ఈ యూఎస్ కే ప్రతినిధులు జెనీవాలో నిర్వహించిన ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో పాల్గొనడం ఇప్పుడు అత్యంత సంచలనమైంది. అంతేగాక ఆ దేశ మహిళా ప్రతినిధి విజయప్రియ నిత్యానంద వివిధ దేశాల ప్రతినిధులను కలిసి కైలాస రాజ్యాంగ పీఠికను కూడా అందజేశారు. దానిని ద భగవద్గీతగా పేర్కొన్నారు.ఇంతకీ ఈ విజయప్రియ నిత్యానంద ఎవరు? అనే చర్చ ఇప్పుడు మొదలయింది.

ఈమె నిత్యానంద భక్తురాలు. అతను సృష్టించిన హిందూ దేశమైన కైలాస దేశానికి చెందిన అమెరికన్ దౌత్యవేత్త. గత నెలలో స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో జరిగిన ఐక్యరాజ్యసమితి సమావేశంలో ఆమె యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస (USK)కి ప్రాతినిధ్యం వహించింది.ఆ సమితి సమావేశాల్లో పాల్గొన్న ఈ కైలాస దేశ ప్రతినిధి ఏకంగా భారత్ పేనే ఆరోపణలు చేసి ఇప్పుడు వరల్డ్ మొత్తాన్ని తన తిప్పుకునేలా చేసింది.తమ నిత్యానందను భారత్ వేధిస్తోందని విజయప్రియ నిత్యానంద డిమాండ్ చేసింది.ఆ సమావేశంలో ఈమె తన వేషధారణతో చూపరులని తనవైపు తిప్పుకునేలా చేసింది. విచిత్రమైన హెయిర్ స్టైల్ తో, కాషాయపు రంగు దుస్తులతో మెడలో రుద్రాక్ష మాలతో అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.

విజయప్రియ నిత్యానంద అసలు పేరు మా విజయప్రియ. ఈమె యునైటెడ్ స్టేట్స్‌లోని వాషింగ్టన్ D.C.లో జన్మించారు. 2005 నుండి 2009 వరకు ఆమె యూనివర్శిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్, ఇంగ్లాండ్‌లో (గ్రేడ్ O-లెవెల్ అండ్ A-లెవెల్) చదివింది. 2010 నుండి 2014 వరకు ఆమె కెనడాలోని విన్నిపెగ్‌లోని మానిటోబా విశ్వవిద్యాలయంలో కెమిస్ట్రీలో మైనర్‌తో మైక్రోబయాలజీలో BSc (ఆనర్స్) చేసింది.విజయప్రియ నిత్యానంద 2010 నుండి 2014 వరకు ఆమె మానిటోబా విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థి స్కాలర్‌షిప్‌ను అందుకుంది. నవంబర్ 2011లో ఆమె అత్యుత్తమ విద్యా పనితీరుకు గానూ యూనివర్సిటీ ఆఫ్ మానిటోబా హానర్ రోల్‌తో సత్కరించింది. జూన్ 2014లో యూనివర్సిటీ ఆఫ్ మానిటోబా ఆమెను డీన్ గౌరవ జాబితాతో సత్కరించింది.

ఆమె తండ్రి పేరు అజయ్ కుమార్ ఖేటూ, తల్లి పేరు మా నిత్య కేదారీశానంద. ఆమె సోదరి పేరు జయప్రియ నిత్యానంద. పూర్తి పేరు మనీషికా ఖేటూ. ఈమె కూడా నిత్యానంద భక్తురాలే..ఇప్పుడు విజయప్రియ నిత్యానంద దేశం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాసలో దౌత్యవేత్తగా పనిచేస్తుంది. ఆమె ఐక్యరాజ్యసమితిలో ‘కైలాస’కి శాశ్వత రాయబారిగా తెలిపింది. ఆమె తన దేశం తరపున వివిధ అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు చేసుకుంది. కైలాస వివిధ దేశాల్లో వివిధ NGOలను ప్రారంభించిందని కూడా ఆమె పేర్కొన్నారు. ఇక విజయప్రియ ఆమె ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.మీరు కూడా చూడండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: