హైదరాబాద్ : ఎన్టీయార్ తో చంద్రబాబు ఆడుకుంటున్నారా ?

Vijaya


ఎన్టీయార్ కు భారతరత్న ఇవ్వాలని ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడు మరోసారి డిమాండ్ చేశారు. తెలంగాణాలో మొదలైన ‘ఇంటింటికి టీడీపీ’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అనవసరమైన విషయాలు  చాలా మాట్లాడిన చంద్రబాబు పనిలోపనిగా ఎన్టీయార్ కు భారతరత్న ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు. చంద్రబాబు విచిత్రమైన  వైఖరి మరోసారి బయటపడింది. విచిత్రం ఎందుకంటే ఎప్పుడు అధికారంలో ఉన్నా ఎన్టీయార్ కు భారతరత్న ఇవ్వాలనే డిమాండును అస్సలు వినిపించరు.



ఎప్పుడైతే ప్రతిపక్షంలోకి వస్తారో అప్పుడే ఎన్టీయార్ కు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ మొదలుపెడతారు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశానని చెప్పుకునే చంద్రబాబు మరి తాను అదికారంలో ఉన్నపుడు ఎన్టీయార్ కు భారతరత్న ఇప్పించాలని ఎందుకు అనిపించలేదు ? పైగా వాజ్ పేయ్ హయాంలో, అంతకుముందు తాను కేంద్ర రాజకీయాల్లో చక్రంతిప్పానని చెప్పుకుంటారు కదా. తాను ఇలా సిఫారసు చేస్తే ఎన్టీయార్ కు అలా భారతరత్న పురస్కారం వచ్చే అవకాశం ఉన్నపుడు కూడా ఎందుకని పట్టించుకోలేదు.



ఎందుకంటే ఎన్టీయార్ కు భారతరత్న రావటం చంద్రబాబుకే ఇష్టంలేదు. ఎన్టీయార్ కు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ కేవలం కంటితుడుపు డిమాండ్ మాత్రమే. ఈ విషయాన్ని ఎన్టీయార్ భార్య లక్ష్మీపార్వతే చెప్పారు. ఒకవేళ ఎన్టీయార్ కు భారతరత్న ఇస్తే ఆ పురస్కారాన్ని భార్యహోదాలో లక్ష్మీపార్వతి అందుకుంటారు. అలా అందుకోవటం కుటుంబసభ్యులతో పాటు చంద్రబాబుకు కూడా ఇష్టంలేదట.



అందుకనే ఎన్టీయార్ కు భారతరత్న అనే డిమాండును కేవలం పార్టీ మీటింగుల్లోను, మీడియా సమావేశాల్లో మాత్రమే చంద్రబాబు వినిపిస్తుంటారు. చంద్రబాబు ఆలోచనలేంటో అందరికీ తెలుసు. అయినా సరే తన పద్దతిని మార్చుకోవటానికి చంద్రబాబు ఏనాడు ప్రయత్నించలేదు. మూసపద్దతిలో ప్రతిపక్షంలోకి రాగానే ఎన్టీయార్ కు భారతరత్న పురస్కారం ఇవ్వాలనే డిమాండ్ వినిపించి నవ్వులపాలవుతుంటారు. హేమిటో చంద్రబాబు ఎప్పటికి మారరంతే. ఎన్టీయార్ కు భారతరత్న అనే డిమాండ్ వినిపించటం చంద్రబాబుకు, రాయటం ఎల్లోమీడియాకు బాగా అలవాటైపోయిందంతే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: