రాయలసీమ : లోకేష్ పై తమ్ముళ్ళు మండిపోతున్నారా ?

Vijaya



పాదయాత్రలో ఉన్న లోకేష్ పై తిరుపతిలో తమ్ముళ్ళు బాగా మండిపోతున్నారట. జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో లోకేష్ అభ్యర్ధులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదే పద్దతిలో తిరుపతిలో కూడా అభ్యర్ధిని ప్రకటిస్తారని తమ్ముళ్ళు అనుకున్నారు. అయితే అలాంటిదేమీ జరగలేదు. అభ్యర్ధిని ప్రకటించకపోగా  నేతలందరినీ కూర్చోబెట్టి ఫుల్లుగా క్లాసు పీకారు.  తిరుపతి నియోజకవర్గంలో లోకేష్ ఆరురోజుల పాటు పాదయాత్ర చేసినా అభ్యర్ధిని మాత్రం ప్రకటించకుండా సస్పెన్స్ మైన్ టెన్ చేశారు.



ఇప్పటికి జిల్లాలోని ఐదుస్ధానాల్లో అభ్యర్ధులను ప్రకటించారు. చంద్రగిరిలో పులివర్తి వెంకటముని ప్రసాద్ (నాని), నగిరిలో భానుప్రకాష్ నాయుడు, శ్రీకాళహస్తిలో gopala krishna REDDY' target='_blank' title='బొజ్జల-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">బొజ్జల సుధీర్ రెడ్డి, సత్యవేడులో డాక్టర్ హెలెన్, పలమనేరులో అమర్నాధరెడ్డిని ప్రకటించేశారు. తిరుపతిలో కూడా తమలో ఎవరో ఒకళ్ళని అభ్యర్ధిగా ప్రకటించమని తమ్ముళ్ళు అడిగినా లోకేష్ పట్టించుకోలేదు. కారణం ఏమిటంటే పార్టీలో అంతర్గత గొడవలు చాలా ఎక్కువగా ఉన్నాయని ముందు వాటిని సర్దుబాటు చేసుకుంటే కానీ అభ్యర్ధిని ప్రకటించేది లేదని లోకేష్ చెప్పేశారు. కావాలనే తిరుపతి నియోజకవర్గంలో అభ్యర్ధిని ప్రకటించలేదని మండిపోతున్నారు. 



ఇక్కడే తమ్ముళ్ళల్లో మండిపోయింది. ఎందుకంటే సత్యవేడులో కూడా గ్రూపు తగాదాలు చాలానే ఉన్నాయి. నగిరిలో కుటుంబకలహాలతో పార్టీ రోడ్డుపైనే పడింది. ఇక్కడ భాను ప్రకాష్ కు తల్లి, తమ్ముడితోనే పడటంలేదు. చంద్రగిరిలో తనకు టికెట్ వద్దని నాని మొత్తుకున్నారు. నాని దృష్టంతా చిత్తూరు అసెంబ్లీ మీదుంది. పైగా నానీకి వైసీపీ నేతలతో వ్యాపార సంబంధాలున్నాయనే ప్రచారం జరుగుతోంది. లోకేష్ ప్రకటించిన అభ్యర్ధిత్వాల్లో పలమనేరులో అమర్ కు మాత్రమే పోటీలేదు.



ఇన్ని నియోజకవర్గాల్లో నేతల మధ్య గొడవలున్నా అక్కడంతా అభ్యర్ధులను ప్రకటించిన లోకేష్ తిరుపతిలో మాత్రం నేతల మధ్య గొడవలను సాకుగా చూపించి అభ్యర్ధిని ప్రకటించకపోవటం ఆశ్చర్యంగానే ఉంది. అయితే కొందరు తమ్ముళ్ళిచ్చిన సమాచారం ఏమిటంటే జనసేనతో పొత్తు కుదిరితే తిరుపతి నియోజకవర్గాన్ని వదిలేసే అవకాశముందట. అందుకనే తమ్ముళ్ళు ఎంత ఒత్తిడిపెట్టినా లోకేష్ తిరుపతి అభ్యర్ధిని మాత్రం ప్రకటించలేదని టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: