ఆ ఉద్యోగంలో నెలకు 4 లక్షల జీతం.. కోటి ప్రయోజనాలు?

Purushottham Vinay
ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగులు చాలా ఎక్కువ. ఇక ఉద్యోగ ప్రకటన రావడమే ఆలస్యం.. వెంటనే వారు అప్లై చేస్తుంటారు. ఇలాంటి సంఘటనలు చాలా చూస్తూ ఉంటాం. అంతెందుకు ఈమధ్య కానిస్టేబుల్ పోస్టులకు పాకిస్థాన్‌లో చాలా మంది యువకులు ఎలా వచ్చారో చూశాం. ఏకంగా స్టేడియాలు కూడా నిండిపోయి.. కిలోమీటర్ల కొద్ది బారులు తీరారు నిరుద్యోగులు. ప్రభుత్వ ఉద్యోగానికి అంత డిమాండ్ అనేది ఉంటుంది. ఇంకొందరు అయితే ఏదో ఒక ఉద్యోగం వచ్చి, జీతం భారీగా ఉంటే చాలనుకుంటారు. ఇలా రెండు రకాలైన నిరుద్యోగులు ప్రపంచవ్యాప్తంగా ఉంటారు. అయితే ఓ కన్సల్టెంట్ కంపెనీ జాబ్ ప్రకటన చేసినాకూడా ఎవరూ ముందుకు రావడం లేదు. జీతమేదో తక్కువనుకుంటే పప్పులో కాలేసినట్లే ఎందుకంటే లక్షల్లో జీతం. భారీ ప్రయోజనాలు కూడా ఉంటాయి.అయినా కూడా ఒక్క దరఖాస్తు కూడా రాలేదట. ఇంతకీ ఆ పోస్టేంటి? ఎక్కడ? ఏంటి? ఎందుకు అప్లై చేయలేదో అని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వార్త చదవండి.


నెలకు రూ.4 లక్షల జీతం ఇంకా విహారయాత్రల ఖర్చు కంపెనీదే. అంతేగాక ఉద్యోగ భద్రత, సంస్థను వీడే ముందు భారీ ప్రయోజనాలు కూడా. ఇలా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇలాంటి ఉద్యోగాన్ని అసలు ఎవరైనా వదులుకుంటారా? కానీ ఈ ఉద్యోగంలో చేరడానికి ఎవరూ ఆసక్తి చూపడం లేదు.ఇంకా ఈ వింత పరిస్థితి స్కాట్‌లాండ్‌లో చోటుచేసుకుంది.స్కాట్లాండ్లోని అబెర్డీన్ తీరంలో ఒక కన్సల్టెంట్ కంపెనీ ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. ఇక అవి ఆఫ్‌షోర్ రిగ్గర్ పోస్టులు.. మొత్తం ఐదు ఖాళీల భర్తీకి ప్రకటనని జారీ చేసింది. ఇక సంవత్సరానికి 6 నెలల పాటు రోజుకు 12 గంటలు విధులు నిర్వర్తించాలి. అంతేగాక ఉద్యోగి అక్కడే రెండేళ్ల పాటు ఉండాలని నిర్ణయించుకుంటే ఉద్యోగం వీడే ముందు కోటి రూపాయల ప్రయోజనం కూడా దక్కుతుంది. ఇంత భారీ మొత్తంలో ప్రయోజనం పొందవచ్చని తెలిసినా కూడా అభ్యర్థులెవరూ అప్లై చేయలేదు. దీంతో ఉద్యోగులు దొరక్క ఆ కంపెనీ తల పట్టుకుంటోంది. చివరకు చమురు కంపెనీలో చేరేందుకు మక్కువ చూపించడం లేదని గ్రహించింది. ఇక ఈ ఉద్యోగం  ఏంటంటే.. సముద్రం అడుగున భూమి పొరల్లోని చమురును వెలికితీయాలి. ఇక అందుకోసమే ఎవరూ ముందుకు రావడం లేదని ఆ కంపెనీ అభిప్రాయపడింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: