పాకిస్థాన్ మాజీ ప్రధానికి పెద్ద ముప్పు?

Purushottham Vinay
ఇక ఫండింగ్ కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధాని అయిన ఇమ్రాన్ ఖాన్‌ను ఏ క్షణానైనా ఖచ్చితంగా అరెస్టు చేసే అవకాశం ఉంది. ఇమ్రాన్ ఖాన్ తన ఫోన్‌ సంభాషణల ఆడియో లీక్‌లపై దర్యాప్తు కోరుతూ వేసిన పిటిషన్‌ను విచారించాలని ఆదివారం నాడు సుప్రీంకోర్టును ఆశ్రయించించడం జరిగింది.ఇక ఇది జరిగిన ఒక రోజు వ్యవధిలో ఆయనను అరెస్ట్‌ చేసేందుకు పాక్‌ ప్రభుత్వం ముమ్మర ఏర్పాట్లని కూడా చేస్తోంది. లాహోర్‌లోని ఇమ్రాన్ ఖాన్ తన పిటీషన్‌లో సుప్రీంకోర్టును ఈ విధంగా అభ్యర్ధించడం జరిగింది. ‘ఈ నా అభ్యర్థనను కూడా వినవలసిందిగా సుప్రీంకోర్టును నేను కోరుతున్నాను. నాకు, నా భార్య బుష్రా బీబీకి సంబంధించిన చాలా ఆడియో లీకేజీలపై నా పార్టీ నాయకులపై చర్యలు తీసుకోవాలని నేను అభ్యర్ధిస్తున్నాను. ఇంకా మా ప్రాథమిక హక్కులను వారు ఉల్లంఘించారు. ఒక దేశ ప్రధానమంత్రి ఫోన్‌ సంభాషణలు లీక్ అయితే అది అధికారిక రహస్యాల చట్టాన్ని ఖచ్చితంగా ఉల్లంఘించినట్టే అవుతుంది. అందుకే తక్షణమే వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని కోర్టుని కోరుతున్నానంటూ’.. ఇమ్రాన్ ఖాన్ విన్నవించారు.


కాగా పాక్ మాజీ ప్రధానికి సంబంధించిన పలు ఆడియోలు గత సంవత్సరం ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమైన సంగతి తెలిసిందే. దీంతో పీఎం హౌస్ ఆడియో లీక్‌లపై దర్యాప్తుకు జాయింట్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (జేఐటీ) లేదా జ్యుడీషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది.ఇమ్రాన్‌ ఖాన్ అరెస్టు కోసం నలుగురు సభ్యుల బృందాన్ని ఎఫ్‌ఐఏ ఏర్పాటు చేసినట్లు సమాచారం తెలుస్తుంది. ఇంకా అలాగే మరోవైపు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇమ్రాన్‌ ఖాన్‌ నివాసం వద్ద పోలీసు బలగాలు కూడా మోహరించాయి.విదేశీ మారకద్రవ్య చట్టాన్ని ఉల్లంఘించి విదేశీ నిధులు పొందారనే ఆరోపణలపై ఇమ్రాన్‌ ఖాన్‌తో పాటు మరో పది మందిపై కేసు నమోదవ్వడం జరిగింది. పార్టీ ఫండింగ్‌లో తీవ్రమైన ఆర్థిక అవకతవకలు చోటుచేసుకున్నట్లు పార్టీ సభ్యులు కేసు నమోదు చెయ్యడం జరిగింది. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: