కోస్తా : కాళ్ళబేరానికి దిగిపోయిన కోటంరెడ్డి ?

Vijaya



ఎలాంటి కోటంరెడ్డి ఎలాగైపోయారు ? వైసీపీ నెల్లూరు రూరల్ ఎంఎల్ఏ కోటంరెడ్డి శ్రీధరరెడ్డంటే కతే వేరుగా ఉండేది. అలాంటిది ఒకే ఒక్కరోజులో ఫేట్ మొత్తం మారిపోయింది. మనసులో ఏదో పెట్టుకుని పైకి జగన్మోహన్ రెడ్డి మీద బురదచల్లేందుకని తన ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందంటు ఒక పనికిమాలిన ఆరోపణ చేశారు. దాంతో కోటంరెడ్డి పరిస్ధితి ఒక్కసారిగా తల్లకిందులైపోయింది. చివరకు కాళ్ళబేరానికి దిగజారిపోయేంతగా పరిస్ధితులు మారిపోయాయి.



ఇంతకీ విషయం ఏమిటంటే వచ్చేఎన్నికల్లో టీడీపీ తరపున నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పోటీచేయాలని ఉందన్న తన కోరికను మీడియా ముందు ప్రకటించారు. తన కోరికను తాను చెప్పానని మరి చంద్రబాబు ఏమిచేస్తారో చూడాలన్నారు. పదిరోజుల క్రితమేమో టీడీపీ తరపున వచ్చేఎన్నికల్లో రూరల్ నియోజకవర్గం నుండి పోటీచేయబోయేది తానే అని బల్లగుద్ది చెప్పారు. ఇపుడేమో రాబోయే ఎన్నికల్లో తనకే టికెట్ ఇవ్వాలంటు చంద్రబాబుతో కాళ్ళబేరానికి దిగిపోయారు.



తనకి తానుగా టికెట్ ప్రకటించుకునే దశనుండి టికెట్ ఇవ్వాలంటు కాళ్ళబేరానికి దిగిపోయేంతగా కోటంరెడ్డి పరిస్ధితులు ఎందుకు దిగజారిపోయాయి ? ఎందుకంటే కోటంరెడ్డిని టీడీపీలో చేర్చుకోవద్దని చాలామంది తమ్ముళ్ళు చంద్రబాబుకు గట్టిగా చెబుతున్నారట. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, బీదరవిచంద్రయాదవ్, అబ్దుల్ అజీజ్ లాంటి సీనియర్లు ఎట్టిపరిస్దితుల్లోను కోటంరెడ్డిని చేర్చుకునేందుకు లేదని అడ్డం పడుతున్నారట. దాంతో చంద్రబాబు కూడా సీనియర్ల మాటకే విలువిచ్చినట్లు సమాచారం. ఈ విషయం తెలిసిన తర్వాతే కోటంరెడ్డికి ఏమిచేయాలో దిక్కుతోచటంలేదని టాక్.



తాజా పరిస్ధితుల్లో ఎంఎల్ఏగా రాజీనామా చేస్తే మొదటికే మోసం వస్తుందని అనుకునే తాను రాజీనామా చేసేదిలేదని అడ్డం తిరిగారు. టీడీపీ తరపున గెలిచి వైసీపీలో చేరిన ఎంఎల్ఏలతో రాజీనామా చేయిస్తే తాను కూడా రాజీనామా చేస్తానని మెలికపెట్టారు. టీడీపీ తరపున గెలిచిన నలుగురు ఎంఎల్ఏలు వల్లభనేని వంశీ, మద్దాలి గిరి, కరణం బలరామకృష్ణమూర్తి, వాసుపల్లి అశోక్ వైసీపీలో చేరలేదు. పైగా వీళ్ళపై చంద్రబాబు సస్పెన్షన్ వేటుకూడా వేయలేదు. పోనీ వీళ్ళపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ కు లేఖ కూడా రాయలేదు. అలాంటిది వాళ్ళతో కోటంరెడ్డి లింకుపెట్టడమే విచిత్రంగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: