రాయలసీమ : చంద్రబాబునే లోకేష్ మించిపోతున్నాడే ?

Vijayaఅబద్ధాలు చెప్పటంలో తండ్రి చంద్రబాబునాయుడు దగ్గర చినబాబు లోకేష్  బాగా ట్రైనింగ్ తీసుకున్నట్లున్నారు. ఇలాంటి వాళ్ళని చూసే ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా ? అనే సామెత పుట్టుంటుంది. ఇంతకీ విషయం ఏమిటంటే పాదయాత్ర యువగళంలో భాగంగా పూతలపట్టులో లోకేష్ మాట్లాడుతు ‘పోలవరంకు పునాది వేసింది మనమే పూర్తి చేసేదీ మనమే’ అంటు చెప్పారు. పార్టీ నేతలు, కార్యకర్తల సమావేశంలో చేసిన ప్రకటనతో అందరు ఆశ్చర్యపోయారు.అసలు పోలవరం ప్రాజెక్టుకు టీడీపీకి ఏమైనా సంబంధముందా ? ఈ ప్రాజెక్టు కోసం అహర్నిశలు కష్టపడింది దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ అన్న విషయం అందరికీ తెలిసిందే. అప్పుడెప్పుడో అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్నపుడు పునాదిరాయి వేసినా తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులెవరూ ప్రాజెక్టును పట్టించుకోలేదు. వైఎస్సార్ వచ్చిన తర్వాతే ప్రాజెక్టుకు అవసరమైన క్లియరెన్సులు వచ్చాయి. వైఎస్ హయాంలోనే ప్రాజెక్టు పనులు మొదలయ్యాయి.2009 ఎన్నికల్లో రెండోసారి సీఎం అయిన రెండునెలలకే వైఎస్ మరణించటంతో మళ్ళీ ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి.  హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్సార్ మరణించుండకపోతే ప్రాజెక్టు 2014లోపే పూర్తయిపోయేదేమో. అందరికీ తెలిసిన వాస్తవం ఇదైతే లోకేష్ మాత్రం ప్రాజెక్టుకు పేరాది వేసింది మనమే అని ఎలా చెప్పారో అర్ధంకావటంలేదు. ఆలోవోకగా అబద్ధాలు చెప్పటం బహుశా తండ్రి దగ్గరనుండే వచ్చుంటుందేమో. ఎందుకంటే చంద్రబాబు కూడా ఇలాగే తనకు సంబంధంలేని వాటిని కూడా తన ఖాతాలో వేసుకుంటారు.
శంషాబాద్ విమానాశ్రయాన్ని నిర్మించింది తానే అని, ఔటర్ రింగ్ రోడ్డు తన హయాంలోనే వచ్చిందంటారు. హైదరాబాద్ మెట్రోకి రూపకల్పన చేసింది తానే అంటారు. నిజానికి పై మూడింటిలో ఏ ఒక్కదానికీ చంద్రబాబుకు సంబంధంలేదు. ఎయిర్ పోర్టు నిర్మించింది, రింగ్ రోడ్డు వేసింది వైఎస్సారే. మెట్రో ప్లానింగ్ జరిగింది కూడా వైఎస్ హయాంలోనే. చంద్రబాబు హయాంలో మొదలై చంద్రబాబే పూర్తిచేసిన ప్రాజెక్టు ఒక్కటి కూడా లేదు. చివరకు పట్టిసీమ ప్రాజెక్టు పనులు కూడా వైఎస్ హయాంలోనే మొదలయ్యాయి. మొత్తానికి కొడుక్కి చంద్రబాబు బాగానే ట్రైనింగ్ ఇచ్చినట్లున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: