రాయలసీమ : లోకేష్ కు కర్నాటక పోలీసుల రక్షణా ?

Vijayaఅసలిది ఎక్కడైనా సాధ్యమౌతుందా ? ఒక రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమానికి మరో రాష్ట్రానికి చెందిన పోలీసులు భద్రత ఎలా ఇవ్వగలరు ? ఇపుడు విషయం ఏమిటంటే కుప్పంలో నారా లోకేష్ ఆధ్వర్యంలో యువగళం పేరుతో పాదయాత్ర జరుగుతున్న విషయం తెలిసిందే. ఆదివారం నాటికి పాదయాత్ర మొదలై మూడోరోజు. తెలుగుదేశంపార్టీ ట్విట్టర్లో పెట్టిన పోస్టు ప్రకారం కుతేగాని గ్రామం వద్దకు లోకేష్ పాదయాత్ర చేరుకోగానే వెంటనే కర్నాటక పోలీసులు భద్రత కల్పించారట.
డీఎస్పీ ఆధ్వర్యంలో రోప్ పార్టీ, కానిస్టేబుళ్ళు లోకేష్ పాదయాత్రకు భద్రత కల్పించారట. వీళ్ళంతా లోకేష్ చుట్టూ చాలా క్రమశిక్షణతో వలయంలాగ ఏర్పడి భద్రత కల్పించారట. ఇదే సమయంలో అక్కడే ఉన్న ఏపీ పోలీసులు మాత్రం చోద్యం చూస్తు కూర్చున్నారట. జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతోనే ఏపీ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటే కర్నాటక పోలీసులు మాత్రం బందోబస్తు ఏర్పాటు చేసినట్లు టీడీపీ ట్విట్టర్ ఖాతాలో ఆరోపణలు చేసింది.లోకేష్ కు భద్రత కల్పించాల్సిన ఏపీ పోలీసులు తమకేమీ సంబంధంలేదని చేతులెత్తేయటం ఏమిటంటు మండిపోయింది. ఇక్కడే ఒక అనుమానం మొదలైంది. ఏపీలో జరుగుతున్న లోకేష్ పాదయాత్రకు భద్రతకల్పించాల్సింది ఏపీ పోలీసులు మాత్రమే. మరి కర్నాటక పోలీసులు లోకేష్ పాదయాత్రకు ఏ విధంగా భద్రత కల్పించినట్లు ? ఇక్కడ ఒక అవకాశముంది. అదేమిటంటే కుప్పం అంటే తమిళనాడు, కర్నాటక సరిహద్దుల్లోని నియోజకవర్గం. కాబట్టి నియోజకవర్గంలోని గ్రామాల్లోని  కొన్ని వీధులు ఏపీలోను మరికొన్ని వీధులు కర్నాటకలో ఉండే అవకాశాలున్నాయి.లోకేష్ పాదయాత్ర కర్నాటకలోని గ్రామాల్లో సాగుతుంటే కర్నాటక పోలీసులు భద్రత కల్సించే అవకాశాలున్నాయి. అప్పుడు కూడా ఏపీ పోలీసులకు అదనపు భద్రతగా కర్నాటక పోలీసులుంటారే కానీ ఏపీ పోలీసుల బాధ్యతలను కర్నాటక పోలీసులు తీసుకునే అవకాశాలుండవు. లేకపోతే తమ రాష్ట్రపరిధిలో పాదయాత్ర జరుగుతున్నది కాబట్టి మర్యదపూర్వకంగా ఆ ప్రాంత డిఎస్పీ+పోలీసులు లోకేష్ ను కలవటానికి వస్తే వచ్చుండచ్చు. ఇంతోటిదానికే టీడీపీ నానా రచ్చ రచ్చచేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: