అమరావతి : చివరకు పవన్ బకరా అయిపోతారా ?

Vijaya

ఒకసారి చరిత్రలోకి వెళితే కుప్పం రోడ్డుషో సందర్భంగా మాట్లాడుతు జనసేనకు లవ్ ప్రపోజ్ చేసినా ఇంతవరకు అటునుండి సమాధానం రాలేదని చంద్రబాబునాయుడన్నారు. తర్వాత లవ్ అనేది రెండువైపులా ఉండాలి కదా తమ్ముడు అని ప్రశ్నించారు. దానికి ఈమధ్యనే జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. రణస్ధలం బహిరంగసభలో మాట్లాడుతు తెలుగుదేశంపార్టీతో పొత్తు పెట్టుకుంటున్నట్లు ప్రకటించారు. మళ్ళీ పార్టీ ఆపీసులో కూడా దాదాపు ఇదే విషయాన్ని పవన్ చెప్పారు.
టీడీపీతో పొత్తు పెట్టుకోబోతున్నట్లు పవన్ రెండుసార్లు చెప్పినా చంద్రబాబు నుండి ఎలాంటి రెస్పాన్స్ కనబడలేదు. పవన్ స్పందించేవరకు జనసేనతో లవ్ ప్రపోజల్, లవ్ లెటర్ అంటు వెంటపడిన చంద్రబాబు తీరా పవన్ అంగీకరించిన తర్వాత ఎందుకని మౌనంగా ఉంటున్నట్లు ? ఇద్దరు కలిసినపుడు పొత్తుల విషయం మాట్లాడుకున్నారని, తనను ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించాలని పవన్ కండీషన్ పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. టీడీపీ వర్గాల ప్రకారం పొత్తులో పవన్ 70 సీట్లు అడిగారనే టాక్ వినబడుతోంది.సీఎం అభ్యర్ధిగా ప్రకటించాలని, 70 సీట్లు కావాలని పవన్  అడిగారనటంలో ఎంతనిజముందో తెలీదు. అందుబాటులోని సమాచారం ప్రకారం రెండింటికీ చంద్రబాబు అంగీకరించే అవకాశాలు దాదాపు లేదనే తెలుస్తోంది. పవన్ డిమాండ్లకు చంద్రబాబు నిరాకరిస్తే అప్పుడు ఏమవుతుంది ? ఏమవుతుంది..ఏమీకాదు. టీడీపీ ఒంటరిగానే పోటీచేస్తుంది. ఇష్టపడితే పవన్ బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళతారు లేకపోతే ఒంటరిగానే పోటీచేస్తారు.రెండింటిలో ఏది జరిగినా మొదట బకరా అయ్యేది పవన్ మాత్రమే. టీడీపీతో పొత్తులేకపోతే జనసేన నుండి ఒక్కళ్ళయినా గెలుస్తారా అన్నది అనుమానమే. జనసేన తరపున పోటీచేయబోయే మిగిలిన వాళ్ళసంగతి వదిలేస్తే అసలు పవన్ కల్యాణ్ గెలుస్తారా అన్నదీ డౌటే. మరీ విషయంలో పవన్ కు క్లారిటి ఉందో లేదో తెలీటంలేదు. మొత్తానికి 2014లో పోటీకి దూరంగా ఉండి ఒకసారి, 2019లో తనను తాను ఎక్కువగా అంచనా వేసుకుని రెండోసారి లాగే 2024లో ఒక వ్యూహం అంటు లేకుండా మూడోసారి ఫెయిలవుతారేమో అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. తనంత తానుగా బకరా అవటానికి సిద్ధపడిన తర్వాత ఎవరు మాత్రం ఆపగలరు ?


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: