అమరావతి : జగనూ ఓడిపోతారా ? ఎల్లోమీడియా కథనం

Vijaya
రాబోయే ఎన్నికలకు సంబంధించి ఎల్లోమీడియా ప్రచారం ఏస్ధాయిలో జరుగుతోందంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఓడిపోతారు అన్నంతగా జరుగుతోంది. శుక్రవారం బ్యానర్ కథనంలో మంత్రివర్గంలోని 25 మందిలో కేవలం ఐదుగురు మాత్రమే గెలుస్తారని మిగిలిన వారంతా ఓడిపోతారని చెప్పింది. ఎవరిదో సర్వే రిపోర్టులో ఈ విషయం తేలిందంటే జనాలు నమ్మరని ఏకంగా ఐప్యాక్ సర్వేలోనే ఈ విషయం బయటపడిందని పెద్ద కత అచ్చేసింది.మంత్రివర్గంలోని ఐదుగురులో గెలిచేది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అంజాద్ భాష, పినిపే విశ్వరూప్, దాడిశెట్టి రాజా, నారాయణస్వామి మాత్రమేనట. మరి ఎల్లోమీడియా చెప్పింది నిజమే అయితే జగన్ కూడా ఓడిపోతారా ? ఐప్యాక్ నిర్వహించిన సర్వేలో ప్రస్తుత మంత్రులు, మాజీల్లో 38 మందిలో 31 మంది ఓడిపోతారని ఐప్యాక్ సర్వేలోనే తేలిందని నానా రచ్చ చేస్తోంది. టీడీపీ చేయించిన సర్వేనో లేకపోతే ఇంకెవరి సర్వేనో అని చెప్పి అచ్చేస్తే జనాలు దాన్ని ఫేక్ సర్వే అని కొట్టిపాడేస్తారు.ఈ విషయం ఎల్లోమీడియాకు బాగా తెలుసు. అందుకనే ఐప్యాక్ సర్వే రిపోర్టు పేరుతో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోందని చెబుతోంది. పైగా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టే వీడియోలో ఐప్యాక్ వాటర్ మార్క్ కూడా ఉండటంతో సర్వే రిపోర్టు ఒరిజనలే అన్నట్లుగా ఎల్లోమీడియా సర్టిఫికేట్ ఇచ్చేసింది. దీన్ని ఐప్యాక్ ఖండించింది. తమ పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సర్వే రిపోర్టును ఫేక్ అంటు కొట్టిపారేసింది. బోగస్ సర్వేని ఐప్యాక్ సర్వేగా ఎల్లోమీడియానే వైరల్ చేస్తోందని మండిపోయింది.రేపటి ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు ? ఎవరు ఓడుతారనేది ఇపుడే ఎవరు చెప్పలేరు. కచ్చితంగా మంత్రులు, అధికారపార్టీలోని ఎంఎల్ఏలపై జనాల్లో ఎంతోకొంత అసంతృప్తి లేదా వ్యతిరేకత కామన్. గతంలో కూడా ఎల్లోమీడియా వాళ్ళ సర్వేలని వీళ్ళ సర్వేలని అచ్చేసినపుడూ జనాలు పట్టించుకోలేదు. జగన్ను ఓడగొట్టి చంద్రబాబునాయుడును అధికారంలోకి తేవటమే లక్ష్యంగా ఎల్లోమీడియా పనిచేస్తోందనే విషయం జనాలందరికీ బాగా తెలుసు. మీడియా ముసుగులో ఎల్లోమీడియా చంద్రబాబు కోసమే పనిచేస్తోందన్న వాస్తవం అందరకీ అర్ధమైంది. అందుకనే మంత్రులకు ముచ్చెమటలే అనే సోది కథనాన్ని అచ్చేసి వదిలేసింది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: