కేసీఆర్ జాతీయ పార్టీలోకి మాజీ సీఎం జంప్... !

VAMSI
తెలంగాణ సీఎం కేసీఆర్ భవిష్యత్తులో జాతీయ రాజకీయాలలో కీలక పాత్రను పోషించాలని, అదే సమయంలో ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు వెళుతున్నారు. అందులో భాగంగానే జాతీయ రాజకీయాలకు సరిపోయే భారతీయ రాష్ట్ర సమితిని తెరాస పార్టీకి పెట్టారు. కానీ కేసీఆర్ అనుకున్నంత స్థాయిలో దీనికి స్పందన రావడం లేదన్నది రాజకీయ వర్గాల అభిప్రాయం. అయినా కానీ దీనిని పెద్ద ఎత్తున హైలైట్ చేయడానికి చేస్తున్న పనులలో భాగమే రోజు ఎవరో ఒకరు ఈ పార్టీలోకి చేర్చుకోవడం. కాగా ఇప్పటి వరకు బి ఆర్ ఎస్ లో చేరిన నాయకులు అంతా కూడా పెద్దగా రాజకీయంగా పేరున్నవారు మరియు ప్రజల మద్దతు ఉన్న వారు కాకపోవడం విశేషం.
మరి ఎందుకు రాజకీయంగా ఎక్కువ గుర్తింపు ఉన్న నాయకులు బి ఆర్ ఎస్ లోకి రావడం లేదన్న విష్యాన్ని కేసీఆర్ అండ్ కో సీరియస్ గా తీసుకోవడం లేదన్నది అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలను పక్కన పెడితే... చుట్టుపక్కల రాష్ట్రాలు తమిళనాడు , కేరళ , కర్ణాటక , ఒడిశా మరియు వెస్ట్ బెంగాల్ నుండి ఎటువంటి నాయకులు కూడా ఇప్పటి వరకు చేరలేదన్న విషయం తెలిసిందే.  అయితే తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఒడిశా రాష్ట్రానికి చెందిన మాజీ సీఎం బి ఆర్ ఎస్ లోకి చేరుతున్నారట. ప్రస్తుతం ఒడిశా మాజీ సీఎం గిరిధర్ గమాంగ్ మరియు ఆయన కుమారు శిశిర్ గమాంగ్ లు బీజేపీ పార్టీలో కొనసాగుతున్నారు.
ఇక కేసీఆర్ తో చర్చలు అనంతరం బి ఆర్ ఎస్ లోకి వెళ్లనున్నట్లు తెలియచేయడంతో పాటు బీజేపీకి ఇద్దరూ రాజీనామా చేశారు. కొన్ని రోజుల్లోనే అధికారికంగా గిరిధర్ గమాంగ్ మరియు ఆయన కుమారుడు బి ఆర్ ఎస్ లోకి అధికారికంగా వెళ్లనున్నారు. గమాంగ్ కుటుంబం గతంలో రాజకీయంగా బాగున్నా ప్రస్తుతం ఆయన ఏ విధంగా ప్రభావితం చేయగలరు అన్నదే ప్రశ్నగా మారింది. గతంలో కాంగ్రెస్ పార్టీ నుండి 2009 , 2014  లో రెండు సార్లు వరుసగా గమాంగ్ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2015 లో బీజేపీ తీర్థాన్ని పుచ్చుకున్నారు... ఆయన సామర్ధ్యం మీద అనుమానంతో 2019 లో బీజేపీ టికెట్ ఇవ్వలేదు. ఇదంతా చూస్తే ఈయన వెళ్లిపోవడంపై బీజేపీకి వచ్చే నష్టం ఏమీ లేదు మరియు కేసీఆర్ పార్టీకి వచ్చే లాభం కూడా ఏమీ లేదు.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: