ఢిల్లీ : రాజుగారి సర్వేట.. నిజమేనా ?

Vijaya
జగన్మోహన్ రెడ్డి మీద చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ కు ఎంత కోపముందో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు అంతకుమించిన కోపముంది. చంద్రబాబు, పవన్ కోపానికి కారణం  ఒకటైతే రాజుగారి కోపానికి కారణం మరోటి. విచారణ పేరుతో సీఐడీ పోలీసులు తన చచ్చేట్లు కొట్టారన్న కారణం రాజుగారిలో జగన్ పై కసిని పెంచేశాయి. దాంతో నిద్రలో కూడా జగన్ను జైలుకు పంపటమే ధ్యేయంగా కలవరిస్తుంటారు. అందుకనే అలుపెరగకుండా జగన్ బెయిల్ కోసం కోర్టుల్లో చాలాకాలం పోరాడారు.ఇపుడిదంతా ఎందుకంటే తాజాగా రాష్ట్రంలో ఈయనొక ఫ్లాష్ సర్వే చేయించారట. దాని ప్రకారం వచ్చేఎన్నికల్లో వైసీపీకి ఘోరపరాజయం తప్పదట. అలాగే టీడీపీ+జనసేనకు అఖండ విజయం తథ్యమట. మరి రాజుగారు నిర్వహించిన సర్వేలో ఇలాంటి రిజల్టు కాక మరేమొస్తుంది ? విచిత్రం ఏమిటంటే తన సర్వే ఫలితాలను జనాలు నమ్ముతారా లేదా అన్నది కూడా ఆలోచించకుండా ఏదేదో చెప్పేశారు. వైసీపీ తిరుగుబాటు ఎంపీ సర్వే ప్రకారం ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప, ఒంగోలు జిల్లాల్లో టీడీపీదే ఫుల్లు హవానట.చెప్పలేనంత మెజారిటితో టీడీపీ గెలుస్తుందని ఆయన చెప్పటమే విచిత్రంగా ఉంది. 12-14 శాతం ఓట్ల మెజారిటీతో టీడీపీ అధికారంలోకి రాబోతోందని తేలిందట. జగన్ చెబుతున్నట్లు 175 సీట్లకు 175 సీట్లు కాదు పార్టీ అట్టర్ ఫ్లాప్ అవుతుందన్నారు. ఇక్కడ విచిత్రం ఏమిటంటే ఏ జిల్లాలో టీడీపీ, జనసేనకు ఎన్నిసీట్లు వస్తాయని చెప్పలేదు. రిజల్టు మొత్తం ఓట్ల పర్సంటేజీల్లోనే చెప్పారు.
మామూలుగా ఎవరు చెప్పినా పలానా పార్టీకి ఇన్నిసీట్లు వస్తాయని ఈ పార్టీకి అన్ని సీట్లొస్తాయని చెబుతారు.  కానీ ఎంపీ మాత్రం వైరెటీగా పర్సంటేజీలు చెప్పారు. ఇందుకే దీన్ని బోగస్ సర్వే అంటు వైసీపీ నేతలు కొట్టిపడేశారు. జగన్ ప్రభుత్వం మీద జనాల్లో పట్టరానంత ఆగ్రహం ఉందట. ఆ ఆగ్రహం ఎందుకో మాత్రం రాజు చెప్పలేదు. అలాగే టీడీపీకి ఎందుకు అధికారం ఇవ్వాలని జనాలు అనుకుంటున్నారో కూడా చెప్పలేదు. మొత్తానికి జగన్ను ఏమీ చేయలేక ఇలా సర్వేల పేరు చెప్పి ఓటమి తథ్యమని చెప్పుకుని తృప్తి పడిపోతున్నారు.  ఈ సర్వేని నమ్ముకుంటే చంద్రబాబు, పవన్ ముణిగపోవటం ఖాయమేనా ?


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: