అమరావతి : జనసేనకు పవనే సమాధి కట్టేస్తున్నారా ?

Vijaya


ఏనుగు చెత్తను తనంతట తానే నెత్తినేసుకుంటుంది. తాజాగా రణస్ధలం బహిరంగసభలో పవన్ కల్యాణ్ మాటలు విన్నతర్వాత  ఈ విషయమే గుర్తుకొస్తోంది.  ఎందుకంటే జనసేనకు పవనే స్వయంగా సమాధి కట్టేందుకు రెడీ అయిపోయారు. సభలో పవన్ మాట్లాడిన మాటలు విన్నతర్వాత ఎవరికైనా ఇలాంటి అనుమానమే వస్తుంది. ఇంతకీ విషయం ఏమిటంటే పవన్ మాట్లాడిన మాటలను ఒకసారి చూద్దాం.పవన్ ఏమన్నారంటే ఒంటరిగా జనసేన పోటీచేస్తే గెలుస్తాననే నమ్మకాన్ని జనాలు తనకు ఇవ్వలేదట. ఒంటరిగా పోటీచేస్తే జనసేనకు వీరమరణం తప్పదట. 2019 ఎన్నికల్లో ఒకసారి జనసేన వీరమరణం పొందిందట. జగన్మోహన్ రెడ్డిని ఓడించాలంటే ఒంటరిపోరాటం వల్ల సాధ్యంకాదట. అందుకనే తెలుగుదేశంపార్టీతో పొత్తు పెట్టుకోవాలని నిర్ణయించారట. అదికూడా గౌరవ, మర్యాదలతో అయితేనే టీడీపీతో పొత్తుంటుందట. గౌరవ, మర్యాదలు దక్కకపోతే జనసేనది ఒంటరిపోరాటమేనట.ఇన్ని అట అట అని చెప్పటంతోనే పవన్ ఎంతటి అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతున్నాడో అర్ధమైపోతోంది. ఒంటరిగా పోటీచేస్తే గెలుస్తామనే నమ్మకాన్ని జనాలు పవన్ కు ఇవ్వాలట. అంతేకానీ ప్రజలకోసం తాను గట్టిగా నిలబడ్డాననే నమ్మకాన్ని పవన్ ఇవ్వడట. అంటే జనాలు పవన్ను నమ్మాలేకానీ తాను మాత్రం జనాలను నమ్మనని పవన్ చెప్పేశారు. పవన్ను నమ్మాల్సిన అవసరం జనాలకు ఏమిటో అర్ధంకావటంలేదు. అసలు పవన్ను రాజకీయాల్లోకి వచ్చి తమను ఉద్దరించమని  అడిగిన జనాలు ఎవరో పవన్ ఒకసారి చెబితే బాగుంటుంది.
అధికారం అందుకోవటంలో ఓట్లు రావాలంటే  పవన్ కు జనాలు తప్ప వేరే ప్రత్యామ్నాయంలేదు. అయితే ఓట్లేసి అధికారం అప్పగించే విషయంలో జనాలకు ప్రత్యామ్నాయాలున్నాయి. ఇక్కడే ఎవరిని ఎవరు నమ్మాలో అర్ధమవుతోంది. అజ్ఞానంలో కొట్టుకుంటున్న పవన్ కు మాత్రమే విషయం బోధపడటంలేదు. కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న జనాలను ఉద్ధరించటానికి అవతరించిన భగవంతుడి అవతారమని పవన్ తనను తాను అనుకుంటున్నారేమో అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవాలని డిసైడ్ అయిపోయారు. పొత్తు పెట్టుకుంటున్నారంతే. ఇంతోటిదానికి రణస్ధలమని, యువశక్తని సొల్లు కబుర్లు ఎందుకు ?  సరే పవన్ చెప్పేదేదో చెప్పేశారో ఇక ఏమి చేయాలో జనాలే తేల్చుకుంటారు.మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: