కుప్పంలో "పొలిటికల్ హీట్"... వరుస మీటింగ్ లతో చంద్రన్న బిజీ !

VAMSI
టీడీపీ అధినేత మరియు ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగి ఉన్నప్పటికీ గతంలో జరిగిన 2019 ఎన్నికలలో రెండవసారి మాత్రమే ఎన్నికల్లో నిలిచిన రాజకీయ పార్టీ వైసీపీ చేతిలో ఘోరపరాజయాన్ని ఎదుర్కొంది. వైసీపీ టీడీపీని భారీ మెజారిటీతో ఓడించి అధికారాన్ని చేజిక్కించుకుంది. అయితే ఎన్నికల ముందు చంద్రబాబు జగన్ ను తేలిగ్గా తీసుకున్నాడు. ఆ తర్వాత ఆ నిర్లక్ష్యానికి ప్రతిఫలం చంద్రన్న ప్రతిపక్షములోకి వెళ్ళిపోయాడు. కానీ వైసీపీ పాలనలో మూడున్నరేళ్లు గడిచిపోయాయి, పాలన గురించి ఒక రకంగా చెప్పాలంటే వ్యతిరేకత మొదలైంది. అందుకే చంద్రన్నకు ఒక్కసారిగా ఊపిరి వచ్చినట్లు అయింది.
ఇక అది మొదలు వరుసగా మీటింగ్ లను కండక్ట్ చేసి ముందు క్యాడర్ ను నిద్ర లేపాడు.. ఆ తరువాత ప్రజల్లోకి వైసీపీ వ్యతిరేకతను తీసుకువెళ్లే ప్లాన్ లో భాగంగా బహిరంగ సభలను పెట్టడం స్టార్ట్ చేశాడు. ఈ మధ్య పెట్టిన అన్ని మీటింగ్ లకు జనాలు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని టీడీపీ తమ్ముళ్లలో కూడా హుషారు వచ్చినట్లయింది. చంద్రబాబు లో కూడా వచ్చే ఎన్నికల్లో గెలవగలము అన్న ఒక్క ఆశ కలిగింది అని చెప్పాలి. రీసెంటుగా ముగిసిన కందుకూరు , గుంటూరు సభలకు కూడా ఒక రేంజ్ లో ప్రజలు తరలివచ్చారు. క్నీ ఈ ఉభయ సభలలో మొత్తం 11 మంది మరణించడం చాలా బాధాకరం.
ఇప్పుడు తన సొంత నియోజకవర్గం అయిన చిత్తూరు జిల్లా కుప్పం కు ఈ రోజు చంద్రబాబు వెళ్లిన విషయం తెలిసిందే. దానితో ఒక్కసారిగా కుప్పంలో వైసీపీ మరియు టీడీపీ నాయకులు అలెర్ట్ అయ్యారు. రానున్న రెండు రోజులు చంద్రన్న ఇదే నియోజకవర్గంలో పర్యటించనున్నారని తెలుస్తోంది. ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన చట్టం కరాంగా బహిరంగ మీటింగ్ లు మరియు ర్యాలీలు పెట్టకూడదు. కానీ టీడీపీ నాయకులు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో మీటింగ్ లను నిర్వహించి తీరుతాం అంటున్నారు. మరి ఇటువంటీ సందర్భంలో వైసీపీ మరియు టీడీపీ ల మధ్యన ఏమి జరుగుతుందో అని పోలీస్ వ్యవస్థ ఒత్తిడిలో ఉన్నారు.  

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: