రాయలసీమ : కావాలనే పోలీసులపై చంద్రబాబు రెచ్చిపోయారా ?

Vijaya






ఉద్దేశ్యపూర్వకంగానే ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడు కుప్పం పర్యటన పెట్టుకున్నట్లున్నారు. ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘించటమే లక్ష్యంగా కుప్పంలో చంద్రబాబు మూడురోజుల పర్యటనకు శాంతిపురం మండలానికి చేరుకున్నారు. రోడ్డుషోలు, ర్యాలీలు, రోడ్లపై సభలను నిషేధిస్తు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే. 1861 చట్టం ప్రకారం రోడ్లపై సభలు, ర్యాలీలు, షోలను ప్రభుత్వం  రద్దుచేసింది. దీనికి కారణం ఏమిటంటే కందుకూరు, గుంటూరులో చంద్రబాబు సభల్లో నాలుగురోజుల వ్యవధిలో 11 మంది చనిపోవటమే.



ఇరుకురోడ్లలో కావాలనే సభలు పెట్టుకుని తన సభలకు పోలోమంటు జనాలు హాజరవుతున్నట్లు చెప్పుకోవటమే చంద్రబాబు ఉద్దేశ్యం. కందుకూరులో ఇలాగే రోడ్డుషో చేసి 8 మంది చనిపోవటానికి కారణమయ్యాడని ప్రభుత్వం భావించింది. ఈ ఘటన మరచిపోకముందే గుంటూరు సభలో తొక్కిసలాట జరిగి ముగ్గురు చనిపోయారు. తన సభలకు జనాలు రారన్న అనుమానంతోనే చీరలపంపిణీ, సంక్రాంతి కానుకలు ఇస్తామని ఉయ్యూరు ఫౌండేషన్తో ప్రచారం చేయించుకున్నారు. సభకు జనాలు వచ్చిన తర్వాత తొక్కిసలాట జరిగి ముగ్గురు చనిపోయారు.



రెండు ఘటనల తర్వాతే ప్రభుత్వం రోడ్లపైన సభలు, ర్యాలీలు తదితరాలను నిషేధించింది. దీన్ని చంద్రబాబు చాలెంజ్ గా తీసుకున్నారు. తన సభలను, ర్యాలీలను నియంత్రించేందుకే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కుట్రలు చేస్తున్నట్లు మండిపోతున్నారు. అందుకనే కావాలనే ప్రభుత్వంతో ఘర్షణ పడేందుకే చంద్రబాబు సడెన్ గా కుప్పం పర్యటన పెట్టుకున్నారు. శాంతిపురం మండలంలో ఎండూరు గ్రామం దగ్గర చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు. దాంతో పోలీసులపైన చంద్రబాబు వీరంగం చేశారు.



‘తాను రోడ్డుపైనే మైకులో మాట్లాడుతానని ఏం చేసుకుంటారో చేసుకోండి’ అంటు సవాలు విసిరారు. తాను రోడ్డుపైన మాట్లాడినందుకు అరెస్టుచేస్తే చేసుకోండంటు నానా గోలచేశారు.  వెనక్కు తిరిగి వెళ్ళిపోవాలని పోలీసులు ఎంతచెప్పినా చంద్రబాబు వినలేదు. పైగా  సభల్లో పవన్ కల్యాణ్ ఏ విధంగా పూనకం వచ్చినట్లు ఊగిపోతు గట్టిగా అరుస్తారో అచ్చం చంద్రబాబు కూడా అలాగే అరుస్తు ఊగిపోయారు. పనిలోపనిగా జగన్ను సైకో ముఖ్యమంత్రంటు నానా రచ్చచేశారు. తమపై చంద్రబాబు విరుచుకుపడుతున్నా ఏమీ చేయలేక పోలీసులు మౌనంగా ఉండిపోయారు. దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకున్న చంద్రబాబు మరింతగా రెచ్చిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: