హైదరాబాద్ : కేసీయార్ మెడకు ఉచ్చు బిగుసుకుంటోందా ?

Vijaya



             

నలుగురు ఎంఎల్ఏల కొనుగోలు కేసు రివర్సులో  చివరకు కేసీయార్ మెడకే చుట్టుకోబోతోందా  ?  హైకోర్టు చేసిన వ్యాఖ్యలను చూసిన తర్వాత అందరిలో ఇవే అనుమానాలు మొదలయ్యాయి. ఎంఎల్ఏల కొనుగోలు దేశభద్రతకు సంబందించిన అంశమన్నంతగా ఆమధ్య కేసీయార్ బిల్డప్పులిచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఎవరో ఊరుపేరు తెలియని ముగ్గురు వచ్చి బీఆర్ఎస్ ఎంఎల్ఏల కొనుగోలుకు బేరాలాడిన విషయం ఆడియో, వీడియోల్లో రికార్డయ్యాయి.




ఇంతమాత్రాన ఏదో ఆకాశానికి చిల్లుపడిపోయినట్లో లేకపోతే భూమి బద్దలైపోయినట్లో కేసీయార్ ఓవర్ యాక్షన్ చేయటమే విచిత్రంగా ఉంది. ఎందుకంటే ఇవే పనులను కేసీయార్ కూడా చేశారు. గడచిన ఎనిమిదన్నరేళ్ళల్లో టీడీపీ, కాంగ్రెస్ తరపున గెలిచిన 37 మంది ఎంఎల్ఏలు బీఆర్ఎస్ లో ఎలా చేరారు. ఎంఎల్ఏలకు ప్రలోభాలు పెట్టడంలో కేసీయార్ కూడా ఏమీ తక్కువ తినలేదు. సరే ఈ విషయాలను పక్కనపెట్టేస్తే బీజేపీ కీలకనేతలను ఏదో చేద్దామని ప్లాన్ వేసి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) నియమించారు కేసీయార్.




అయితే ఆ సిట్ దర్యాప్తును హైకోర్టు రద్దుచేసి విచారణను సీబీఐకి అప్పగించింది. దీంతో కేసీయార్ గొంతులో పచ్చివెలక్కాయ పడినట్లే అయ్యింది. హైకోర్టే స్వయంగా ఆదేశించింది కాబట్టి నిరభ్యంతరంగా సీబీఐ దర్యాప్తుకోసం తెలంగాణాలోకి ఎంటరైపోతుంది. నలుగురు ఎంఎల్ఏలను విచారిస్తుంది. అలాగే సాక్ష్యాలు కేసీయార్ చేతికి ఎలాగ అందాయనే కోణంలో సీబీఐ దర్యాప్తు చేయాలని అనుకుంటే కచ్చితంగా కేసీయార్ కు కూడా నోటీసులిస్తుంది. అప్పుడు సీబీఐ విచారణకు  కేసీయార్ హాజరవ్వాల్సుంటంది.

గోప్యంగా ఉండాల్సిన సాక్ష్యాధారాలు బయటవ్యక్తులకు ఎలా వెళ్ళాయన్న హైకోర్టు ప్రశ్నకు సిట్ సమాధానం చెప్పలేకపోయింది. ఆమధ్య మీడియా సమావేశంపెట్టి కేసీయార్ వీడియోలను ప్రదర్శించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా పెన్ డ్రైవ్ కాపీలను రాష్ట్రపతి, సుప్రింకోర్టు చీఫ్ జస్టిస్ తో పాటు బీజేపీయేతర ప్రభుత్వాలకు, ప్రతిపక్షపార్టీల అధినేతలకు పంపుతున్నట్లు స్వయంగా కేసీయారే చెప్పరు. కాబట్టి సీబీఐ విచారణలో ఆ విషయాలన్నీ బయటకు వస్తాయి. అప్పుడు కేసీయారే గట్టిగా తగులుకుంటారు. ఎవరినో ఏదో చేయాలనుకుని చివరకు కేసీయారే ఏమో అయిపోతారేమో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: