స్మాల్ సేవింగ్ స్కీమ్స్.. న్యూయర్ గిఫ్ట్ మీకోసమే..

Satvika
సాదారణంగా అందరికి పొదుపు చెయ్యాలని వుంటుంది.. కానీ కొన్ని కారణాల వల్ల లేదా ఎలా ఇన్వెస్ట్ చెయ్యాలో తెలియక ఇబ్బందులు పడతారు.పీపీఎఫ్‌, సుకన్య సమృద్ధి యోజనతో సహా పోస్టాఫీసు చిన్న పొదుపు పథకాలలో పెట్టుబడి పెడితే, మీరు గొప్ప వార్తను అందుకోనున్నారు. మీరు కష్టపడి సంపాదించిన డబ్బు, పెట్టుబడిపై మంచి ఆదాయాన్ని కూడా అందుకోవచ్చు.. అయితే ప్రతి ఒక్కరూ కూడా చిన్న పొదుపు పథకాల లో డబ్బులను ఇన్వెస్ట్ చెయ్యడం మంచిదే..

ఇకపోతే ఈ నెల 30 నుంచి చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది. డిసెంబరు 30న ఈ పథకాల వడ్డీ రేట్లను సమీక్షించిన తర్వాత ఆర్థిక మంత్రిత్వ శాఖ పెంచడానికి ప్రకటించవచ్చు. ఆర్థిక మంత్రిత్వ శాఖ 2022-23 నాల్గవ త్రైమాసికంలో జనవరి నుండి మార్చి వరకు చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్ల పై ఒక పూర్తీ నివేదికను సమర్పిస్తారు.. దీనిలో పీపీఎఫ్‌, సుకన్య సమృద్ధి యోజన వంటి పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు పెరగవచ్చని భావిస్తున్నారు. ఈ పొదుపు పథకాలతో సహా పోస్టాఫీసు ఇతర పొదుపు పథకాలపై కూడా వడ్డీ రేట్లు పెరగవచ్చు..

రేపో రేటు అనేది పెరుగుతూ వస్తుంది..ఇప్పటికే నాలుగు సార్లు పెరిగిన సంగతి తెలిసిందే..చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను పెంచలేదు. పీపీఎఫ్‌, సుకన్య సమృద్ధి యోజన, ఎన్‌ఎస్‌సీ వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పు లేదు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌పై 7.1 శాతం, ఎన్‌ఎస్‌సిపై 6.8 శాతం అంటే నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్, సుకన్య సమృద్ధి యోజనపై 7.6 శాతం వడ్డీ అలాగే ఉంటుంది. రెపో రేటును 2.25 శాతం పెంచిన తర్వాత ఈ పథకాల వడ్డీ రేట్లను ప్రభుత్వం పెంచవచ్చు..

గతంలో పెరిగిన వడ్డీ రేట్ల విషయానికొస్తే..కిసాన్ వికాస్ పత్ర వడ్డీ రేటును 6.9 శాతం నుండి 7 శాతానికి పెంచారు. అయితే మెచ్యూరిటీ వ్యవధిని 124 నెలల నుండి 123 నెలలకు తగ్గించారు. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌పై వడ్డీ రేటును 7.4 శాతం నుంచి 7.6 శాతానికి పెంచారు. పోస్టాఫీసు రెండేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకంపై 5.5 శాతానికి బదులుగా 6.7 శాతం, 3 సంవత్సరాల ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌పై 5.5 శాతానికి పెంచారు..ఇక మిగిలిన వాటి పై మాత్రం ఎటువంటి మార్పు లేదు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: