రోజుకు రూ.74 ఇన్వెస్ట్ చేస్తే, కోటి రూపాయలు పొందవచ్చు..వివరాలివే..

Satvika
చాలా మంది ఉద్యోగంలో చేరిన తర్వాత నుంచి పదవీ విరమణ వరకూ ఎన్నో ప్లానులు వేస్తారు..ఇలా చెయ్యాలి..అలా చెయ్యాలి అంటూ డబ్బులను ఇన్వెస్ట్ చేసే పథకాల గురించి తెగ సెర్చ్ చేస్తారు. మొదటి నుంచి అలా పొదుపు చెయ్యడం వల్ల వృద్ధాప్యం లో ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు కలుగవు అని నిపుణులు అంటున్నారు.. అప్పుడు బ్రతికినంత కాలం టెన్షన్ లేకుండా సాగిపోతుంది. పదవీ విరమణ తరువాత ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు పొందడంతో పాటు.. నెలవారీ పెన్షన్ కూడా పొందవచ్చు..జీవితానికి భరోసా కూడా ఉంటుంది..అలాంటి వాటిలో ఒకటి జాతీయ పెన్షన్ స్కీమ్ ఉత్తమమైనది. ఇందులో పెట్టుబడి పెట్టడం ద్వారా పదవీ విరమణ చేసినప్పుడు కోటి రూపాయలను పొందవచ్చు..
ఈ స్కీమ్ పూర్తీ వివరాలు..

ఇందులో రోజుకు 74 రూపాయలు ఇన్వెస్ట్ చెయ్యాలి.. ఉదాహరణకు మీకు 20 సంవత్సరాలు ఉంటే పదవీ విరమణకు ఇప్పటి నుంచే ప్లాన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా చేయడం ద్వారా పదవి విరమణ తరువాత పెద్ద మొత్తంలో డబ్బు పొందడానికి ఆస్కారం ఉంటుంది. అయితే, రోజూ 74 రూపాయలు ఆదా చేయడం అనేది పెద్ద సమస్య కాదు తక్కువ అమౌంట్ అనే చెప్పాలి... ఎన్‌పిఎస్‌లో నిధులు స్టాక్ మార్కెట్, ఇతర సంస్థల్లో పెట్టుబడులు పెడతాయి. ఇందులో కార్పొరేట్, ప్రభుత్వ బాండ్లు ఉంటాయి. సాధారణంగా ఈక్విటీ మొత్తంలో 75% వరకు ఉంటుంది. పీపీఎఫ్, ఈపీఎఫ్ తో పోలిస్తే.. ఎన్‌పీఎస్‌లో పెట్టుబడి పెట్టడం వలన మెరుగైన లాభాలను పొందవచ్చు..
 

రోజూ 74 రూపాయలు, నెలవారీగా రూ. 2,230 ఇందులో ఇన్వెస్ట్ చేయాలి. 40 ఏళ్ల తరువాత 60 ఏళ్లకు రిటైర్ అయ్యాక మీ చేతికి కోటి రూపాయలు అందుతాయి. 9 శాతం వడ్డీతో పదవీ విరమణ సమయానికి రూ. 1.03 కోట్లు చేతికి అందుతాయి. అలాగే.. మీరు బతికున్నంత కాలం నెల వారీగా పెన్షన్ కూడా వస్తుంది. 20 సంవత్సరాల వయస్సులో ఎన్‌పీఎస్‌లో నెలవారీగా రూ. 2230 పెట్టుబడి పెట్టడం ద్వారా 9% వడ్డీరేటుతో రాబడిని పొందే అవకాశం ఉంది. ఇలా 40 సంవత్సరాలు పెట్టుబడి పెట్టాలి. అయితే, ఈ పెట్టుబడిలో 60 శాతం డబ్బును మాత్రమే ఒకేసారి విత్‌డ్రా చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మిగిలిన 40 శాతం నెలవారీ పెన్షన్ పొందే యాన్యూటీ ప్లాన్‌లో తప్పనిసరిగా పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. 60 ఏళ్ల వయసులో రూ. 61.86 లక్షలు చేతికి అందుతాయి. నెలవారీగా పెన్షన్‌ సుమారు రూ. 27,500 వరకు వస్తుంది.. ఇది మంచి బెనిఫిట్స్ అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: