పాన్ కార్డు కు డేట్ ఉంటుందా..ఎలా తెలుసుకోవాలంటే?

Satvika
అత్యంత ముఖ్యమైన డాక్యుమెంట్స్ లలో పాన్ కార్డు కూడా ఒకటి..లావాదేవీలకు సంబందించిన వాటికి పాన్ కార్డు తప్పనిసరి.. ఇన్కమ్ టాక్స్ కు పాన్ కార్డు చూపించాలి..అందుకే ప్రతి ఒక్కరూ పాన్ కార్డును తీసుకొవాలని అధికారులు అంటున్నారు. బ్యాంక్ అకౌంట్ ను కూడా ఓపెన్ చెయ్యాలంటే పాన్ కార్డు తప్పనిసరిగా సమర్పించాలి.. అయితే ఆధార్ కూడా ముఖ్యమైన డాక్యుమెంట్..పాన్ కు ఆధార్ కార్డును లింక్ చెయ్యాలని అధికారులు గత కొంతకాలంగా వినిపిస్తోంది.. ఇంకోటి రెండు పాన్ కార్డులు వుంటే వెంటనే తిరిగి ఇచ్చేయాలని తెలిపారు..

అయితే , పాన్ కార్డు కు చివరి తేదీ అనేది ఉందన్న విషయం చాలా మందికి తెలియదు..కానీ దీనికి ఉంది.. పాన్‌ కార్డు జీవితకాలంగా చెల్లుబాటు కలిగి ఉంటుంది. అంటే ఒకసారి పాన్‌కార్డును తీసుకుంటే వ్యక్తి బ్రతికి ఉన్న వరకూ పని చేస్తుంది. పాన్‌కార్డులో ఉండే 10 నంబర్లే ముఖ్యం. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత దానిని సరెండర్‌ చేసే సదుపాయాన్ని ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ శాఖ అందిస్తుంది. మరణించిన వ్యక్తి పాన్‌కార్డు యాక్టివ్‌, డియాక్టివ్‌ చేసే ఆఫ్షన్ కూడా ఉంది..

చనిపోయిన వ్యక్తి కార్డును ఎలా ఇవ్వాలి అంటే..ఎ వ్యక్తి మరనించారో అతని కుటుంబ సభ్యులెవరైనా పాన్‌కార్డును ఇన్‌కమ్‌ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌కు ఇవ్వడం చేయవచ్చు. కార్డును తిరిగి చేయాలనుకుంటే ముందుగా మీరు అసెస్‌మెంట్ ఆఫీసర్‌కి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు.. మీరు దరఖాస్తులో పాన్ కార్డును  ఎందుకు ఇస్తున్నారో దానికి కారణాన్ని కూడా రాయాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్‌లో మరణించిన వ్యక్తి పేరు, పుట్టిన తేదీ, మరణ ధృవీకరణ పత్రం, పాన్ నంబర్ వంటి మొత్తం సమాచారాన్ని కూడా నమోదు చేయాలి. ఈ దరఖాస్తుతో పాటు మీరు మరణ ధృవీకరణ పత్రాన్ని కూడా జతచేయాలి. దానికి తోడు మీరు దరఖాస్తు కాపీని ఉంచుకోవాలి. అప్పుడే మీరు పాన్ కార్డ్ సరెండర్ రుజువు ఇవ్వవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: