ఆ పథకం ప్రయోజనాల గురించి తెలుసుకోవాలి..

Satvika
అమ్మాయిల భవిష్యత్ కోసం మోడీ ప్రభుత్వం కొత్త కొత్త పథకాలను అందిస్తూ వస్తుంది.. ఇప్పటికే అందుబాటు లో ఉన్న పథకాలతో అమ్మాయిల కోసం మరిన్ని ప్రయొజనాలను అందింస్తుంది..అదే సుకన్య సమృద్ధి యోజన.. సాదారణ కుటుంబాల వారికి ఈ పథకాన్ని గురించి చెప్పనక్కర్లేదు. 2015లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇందులో డిపాజిట్ చేసిన సొమ్ముకు అధిక వడ్డీ చెల్లించడమే కాకుండా, ఆదాయపు పన్ను మినహాయింపులను కుడా అందిస్తుంది..ఎక్కువ పనుల  ప్రయోజలుండే ఈ పథకం బెన్ఫిట్స్ ఏంటో తెలుసుకుందాం.

ప్రభుత్వ  నిబంధనల ప్రకారం ఈ పథకం కింద సొమ్మును పొదుపు చేయాలంటే.. 10 ఏళ్ల లోపు ఆడపిల్ల తల్లిదండ్రులు మాత్రమే అర్హులు. బ్యాంక్ లేదా పోస్టాఫీస్ ఎక్కడైన ఓ చోట మాత్రమే సుకన్య సమృద్ధి ఖాతాను తెరవవచ్చు.. కుటుంబం లో ఇద్దరు కంటే ఎక్కువ మంది ఆడ పిల్లలుంటే ఇద్దరికి మాత్రమే ఖాతను తెరిచే అవకాశం ఉంది.

ఈ పథకం కింద ఏడాదికి 7.6 శాతం వడ్డీ వస్తుంది. సంవత్సరానికి రూ.250 కనీస బ్యాలెన్స్ తో ఎకౌంట్ ను నిర్వహించకోవచ్చు. ఏడాదికి రూ.1.50 లక్షల వరకూ ఇందులో డిపాజిట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ రూ.250 తో ఖాతాను నిర్వహించలేకపోతే రూ.50 తో మళ్లీ ఖాతాను తిరిగి కొనసాగించవచ్చు . అంటే రూ.300 తో ఖాతా ను ప్రారంభిస్తె అందుబాటు లో ఉంటుంది. కానీ ఖాతా తెరిచిన నాటి నుంచి 15 ఏళ్ల లోపు మాత్రమే ఈ పథకం తెరిచే అవకాశం వుంది.ఒకవేళ అకౌంట్ ను క్లోజ్ అవ్వడాని కి ఐదు ఏళ్ళు పడుతుంది.ఖాతా తెరిచిన నాటి నుంచి 21 సంవత్సరాలు పూర్తయ్యాక మెచ్యూరిటీ అవుతుంది. లేదా ఖాతాదారుని వయస్సు 18 ఏళ్లు పూర్తయ్యాక పెళ్లి సమయంలో కూడా ఖాతా మెచ్యూర్ అవుతుంది..దగ్గరలొని పోస్టాఫీసు, లేదా బ్యాంకుల్లో ఈ ఖాతా ను తెరవవచ్చు...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: