కీవ్ : ఉక్రెయిన్ కు అమెరికా, జర్మనీ షాక్

Vijaya


ఎక్కడైనా బావే కానీ వంగతోట దగ్గర కాదన్న సామెతలాగ అయిపోయింది ఉక్రెయిన్ పరిస్ధితి. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలై దాదాపు ఏడాది అవుతోంది. రష్యా ఒంటరిగానే యుద్ధంలో చేస్తున్నది. ఇదే సమయంలో ఉక్రెయిన్ మాత్రం అమెరికా, నాటో దేశాల మద్దతు వల్లే రష్యాను ఎదుర్కొంటోంది. అమెరికా, నాటోదేశాల మద్దతులేకపోతే రష్యా దెబ్బకు  ఉక్రెయిన్ నామరూపాలు లేకుండా పోయేదే. అయితే ఇంతకాలం ఆర్ధికంగా, ఆయుధాల పరంగా ఇంతమద్దతుగా నిలిచిన అమెరికా, జర్మనీ ఇప్పుడు మాత్రం ఉక్రెయిన్ అద్యక్షుడు జెలెన్ స్కీకి పెద్ద షాకిచ్చాయి.



ఇంతకాలం డిఫెన్స్ కే పరిమితమైన ఉక్రెయిన్ తొందరలో రష్యాపై ఎదురుదాడులు చేయాలని డిసైడ్ అయ్యింది. ఎదురుదాడులు చేయాలంటే  ఉక్రెయిన్ దగ్గరున్న ఆయుధాలు సరిపోవు. అందుకని అమెరికా దగ్గరున్న అత్యాధునికి యుద్ధట్యాంక్ ఎం1 అబ్రామ్, దీర్ఘశ్రేణి క్షిపణలను కావాలని అడిగారు. అయితే వీటిని ఇచ్చేదిలేదని అమెరికా తెగేసి చెప్పేసింది. రష్యాతో తాము డైరెక్టు యుద్ధాన్ని కోరుకోవటంలేదని స్పష్టంచేసింది. తమ దగ్గరున్న అత్యాధునిక ఆయుధాలను ఉక్రెయిన్ కు ఇచ్చి వాటిని రష్యాపై ప్రయోగించేట్లు చేస్తే తాము ఇబ్బందుల్లో పడతామని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ చెప్పేశారు.



అలాగే జర్మనీ దగ్గరున్న లెపర్డ్ మర్డర్ యుద్ధట్యాంకులను కావాలని జెలెన్ స్కీ అడిగితే ఇవ్వటం కుదరదని చెప్పేసింది. రష్యా దాడుల నుండి కాచుకోవటానికి డిఫెన్స్ కు అవసరమైన ఆయుధాలను అందిస్తున్న అమెరికా, జర్మనీలు రష్యాపై ఉక్రెయిన్ ఎదురుదాడులు చేయటానికి మాత్రం సాయం చేయలేమని చెప్పేయటం ఆశ్చర్యంగా ఉంది. అంటే దీన్నిబట్టి అర్ధమవుతున్నదేమంటే ఉక్రెయిన్ కు ఎంతవరకు ఆయుధాలు అందించాలో అంతవరకే అందిస్తున్నాయి. ఎదురుదాడి చేయటానికి సాయం చేయమంటే కుదరదని చెప్పేశాయి.




ఒకవేళ తనంతట తానుగా రష్యాపై ఉక్రెయిన్ ఎదురుదాడులు మొదలుపెడితే బహుశా అమెరికా, నాటో దేశాలు మద్దతు ఉపసంహరించుకున్నా ఆశ్చర్యపోవక్కర్లేదేమో అనిపిస్తోంది. ఇదే గనుక జరిగితే రష్యా దెబ్బకు  ప్రపంచపఠంలో నుండి ఉక్రెయిన్ మాయమైపోవటానికి ఎక్కువరోజులు పట్టదు. మరి ఉక్రెయిన్ భవిష్యత్తు ఏమవుతుందో కాలమే నిర్ణయించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: