సొంతిల్లు కావాలా? 25 లక్షల ఉచిత సాయం.. ఎక్కడంటే?

Purushottham Vinay
సొంతిల్లు అనేది ప్రతి పేద మధ్య తరగతి మనిషి కల. కానీ చాలా మందికి కూడా అదొక కల లానే మిగిలిపోతుంది. చాలా మంది కూడా సొంతిల్లు లేక రెంట్ ఇంట్లోనే వుంటున్నారు. ముఖ్యంగా మన దేశంలో అయితే ఇలాంటి వారి సంఖ్య చాలా ఎక్కువ. ఇల్లు కొనాలంటే పెరుగుతున్న ఆస్తుల రేటు గురించి తెలుసుకోవాలి. ఏ నగరంలో లేదా గ్రామంలో మీరు ల్యాండ్ కొనడానికి వెళితే, అక్కడి ధరలను కూడా తెలుసుకోవాలి.అయితే దీనికి భిన్నంగా తమ ప్రాంతంలో సెటిల్ అవ్వాలనుకునేవారికి అక్కడి అడ్మినిస్ట్రేషన్ ఇల్లు కొనుక్కోవడానికి ఏకంగా 25 లక్షల రూపాయలు ఇస్తుంది. ఈ ఆఫర్ ని ఎవరైనా నమ్ముతారా? కానీ అదే నిజం. ఇక ఈ నగరం ఆగ్నేయ ఇటలీలో ఉంది, దీనిని ప్రెసిక్స్ అని అంటారు. ఇక్కడి పరిపాలనా విభాగం ఇక్కడ ఎవరైనా సెటిల్ అవ్వాలనుకుంటే అందుకు తగ్గట్టు ఇక్కడి ఖాళీ ఇళ్లను కొనడానికి దాదాపు 30 వేల యూరోలను ఉచితంగా ఇస్తుంది. మన కరెన్సీ ప్రకారం అయితే ఏకంగా 25 లక్షల రూపాయల కంటే ఎక్కువ ఉంటుంది.

ఇక మీరు ఈ సిటీలో సెటిల్ అయ్యి ఈ విధంగా 25 లక్షల రూపాయలు తీసుకోవాలనుకుంటే, మీరు నగరానికి సంబంధించిన వెబ్సైట్ను విజిట్ చేసి దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ నగరంలో లెక్కకు మించి చాలా ఇళ్ళు ఖాళీగా ఉన్నాయట. ఈ సిటీ ఎడారిగా మారిందని నగరానికి చెందిన కౌన్సిలర్ ఆల్ఫ్రెడో పల్లిస్ తెలిపారు. ఇలాంటి దుర్భర పరిస్థితిలో ఈ నగర ఆర్థిక వ్యవస్థను మెరుగు పరచడానికి ఇక్కడి ఇళ్ళు కొనుగోలు చేయడానికి ఆసక్తిగా ఉన్న వారికి డబ్బు ఇవ్వాలని తాము ఒక ప్రణాళికను రూపొందించామని తెలిపారు. ఇక్కడ ఉన్న ఇళ్ల ఖరీదు 25 వేల యూరోలు. ఈ ఇళ్ళు దాదాపు 50 చదరపు మీటర్లలో నిర్మితమయ్యాయి. ఇటలీలో ఇలా ఖాళీగా ఉన్న నగరాలను ప్రజలతో నింపేందుకు ఇలాంటి బంపర్ ఆఫర్లు ఇస్తుంటారు. ఇంతకు ముందు కూడా ఇటలీలోని కాలాబ్రియా నగరంలో ప్రజలు సెటిల్ అయ్యేందుకు ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.24.76 లక్షలు ఇచ్చింది. ఇక్కడ సెటిల్ అయిన వారు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం ఆర్ధిక సహాయం కూడా చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: