lic super scheme: నెలకి రూ.9250 పొందే అవకాశం..!

Satvika
కొన్ని స్కీమ్ లలో డబ్బులను ఇన్వెస్ట్ చెయ్యడం వల్ల మంచి లాభాలను పొందుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది..ముఖ్యంగా సీనియర్స్ కు ఇది బెస్ట్ ప్లాన్ అనే చెప్పాలి..అక్కడ వారు మంచి రాబడిని పొందుతారు. అంతేకాదు వారి డబ్బు కూడా సురక్షితంగా ఉంటుంది. అలాంటి పథకమే ప్రధాన మంత్రి వయ వందన యోజన కూడా. ఇందులో మీ డబ్బు సురక్షితంగా ఉంటుంది. సాధారణ వ్యవధిలో రిటర్న్‌లు కూడా ఉంటాయి. ఈ స్కీం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఈ ప్రభుత్వ పథకం కింద 60 ఏళ్ల తర్వాత భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ప్రతి నెలా రూ. 18500 పెన్షన్ ప్రయోజనాన్ని పొందవచ్చు. అంతేకాదు 10 సంవత్సరాల తర్వాత మీ మొత్తం పెట్టుబడి కూడా తిరిగి లభిస్తుంది. ప్రధాన్ మంత్రి వయ వందన యోజన పథకాన్ని మోడీ ప్రభుత్వం సీనియర్ సిటిజన్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రవేశపెట్టింది. ఈ పథకం సామాజిక భద్రతా పథకం, పెన్షన్ పథకం. దీనిని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తోంది..

60 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులు నెలవారీ లేదా వార్షిక పెన్షన్ ప్లాన్‌ను ఎంచుకోవచ్చు. ఈ పథకం కింద గరిష్ట పెట్టుబడి పరిమితి రూ. 15 లక్షలు. ప్రధాన మంత్రి వయ వందన యోజన కింద నెలవారీ పెన్షన్ ప్లాన్‌కు 10 సంవత్సరాల పాటు 8 శాతం వడ్డీ లభిస్తుంది. మరోవైపు వార్షిక పెన్షన్‌ను ఎంచుకుంటే 10 సంవత్సరాలకు 8.3 శాతం వడ్డీ లభిస్తుంది. ఈ ప్రభుత్వ పథకంలో,ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అంతేకాదు lic అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి కూడా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంచుకున్న ప్లాన్‌పై ఆధారపడి, పాలసీదారుడు మొత్తాన్ని డిపాజిట్ చేయాలి. తర్వాత 1 సంవత్సరం, 6 నెలలు, 3 నెలలు లేదా ఒక నెల తర్వాత మొదటి విడత పెన్షన్ అందుతుంది..నెలకు 1000 నుంచి 9 వేలకు పైగా పెన్షన్ ను పొందవచ్చు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: