మీ పీఎఫ్ బ్యాలెన్స్ ను ఇలా సులువుగా తెలుసుకోవచ్చు..

Satvika
ప్రభుత్వ,ప్రైవేట్ రంగాల్లొ ఉద్యోగాలు చేసేవారు..పీఎఫ్ అకౌంట్ ఉండటం తప్పనిసరి. ప్రతి ఉద్యోగికి నెలవారీ జీతం నుంచి కొంత మొత్తంలో కట్ చేయబడుతుంది.అదే విధంగా కంపెనీ నుంచి కూడా కొంత అమౌంట్ ఉద్యోగి ఖాతాకు బదిలీ అవుతుంటుంది. అయితే పీఎఫ్‌ అనేది ప్రతి నెల ఉద్యోగి ఖాతాల్లోకి బదిలీ అవుతుంది. అయితే మీ పీఎఫ్‌ ఖాతాలో ఎంత డబ్బు ఉందనే విషయాన్ని సులభంగా తెలుసుకోవచ్చు. ఈ రోజుల్లో అన్ని ఆన్‌లైన్‌ విధానాలు అందుబాటులోకి వస్తుండటంతో మరింత సులభతరం అవుతోంది. ప్రతిసారి పీఎఫ్‌ బ్యాలెన్స్‌ తెలుసుకోవడానికి వెబ్‌సైట్లో లాగిన్‌ కావాల్సి ఉంటుంది. ఇలా వెబ్‌సైట్లోనే కాకుండా వివిధ మార్గాల ద్వారా కూడా పీఎఫ్‌ బ్యాలెన్స్‌ను తెలుసుకోవచ్చు. నిమిషాల వ్యవధిలోనే ఈ పని చేసుకోవచ్చు..
మీ అకౌంట్ వివరాలను తెలుసుకోవడం కోసం..
పీఎఫ్‌ డబ్బును చెక్ చేయడానికి మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి 011-22901406కు మిస్డ్ కాల్ ఇవ్వాలి. మీరు ఈపీఎఫ్‌వోసందేశం ద్వారా పీఎఫ్‌ వివరాలను పొందుతారు. ఇక్కడ కూడా మీ యూఏఎన్‌, పాన్‌, ఆధార్‌ను లింక్ చేయడం తప్పనిసరి.
* ఆన్‌లైన్‌లో బ్యాలెన్స్‌ని తనిఖీ చేయడానికి మీరు ఈపీఎఫ్‌వో వెబ్‌సైట్‌కి లాగిన్ అవ్వాలి, epfindia.gov.inలో ఇ-పాస్‌బుక్‌పై క్లిక్ చేయండి.
* ఇప్పుడు మీ ఇ-పాస్‌బుక్‌పై క్లిక్ చేస్తే, passbook.epfindia.gov.inకి కొత్త పేజీ వస్తుంది.
* ఇప్పుడు ఇక్కడ మీరు మీ వినియోగదారు పేరు పాస్‌వర్డ్, క్యాప్చార్‌ చేయాలి.
*అన్ని వివరాలను పూరించిన తర్వాత, మీరు కొత్త పేజీకి వెళ్తారు. ఇక్కడ మీరు సభ్యుల ఐడీని ఎంచుకోవలసి ఉంటుంది.
*ఇక్కడ మీరు ఇ-పాస్‌బుక్‌లో మీ ఈపీఎఫ్‌ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు.
ఇక ఉమాంగ్ యాప్ ద్వారా..

మీరు మీ ఉమాంగ్‌ యాప్ ఓపెన్‌ చేసి ఈపీఎఫ్‌వోపై క్లిక్ చేయండి.
* ఇప్పుడు మరొక పేజీలో ఉద్యోగి-కేంద్రీకృత సేవలపై క్లిక్ చేయండి.
*. ఇక్కడ మీరు 'View Passbook'పై క్లిక్ చేయండి. దీనితో, మీరు మీ UAN నంబర్, పాస్‌వర్డ్ (OTP) నంబర్‌ను ఎంటర్‌ చేయండి.
*. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. దీని తర్వాత మీరు మీ PF బ్యాలెన్స్‌ని చెక్ చేసుకోవచ్చు.
*.ముందుగా epfindia.gov.in EPF హోమ్ పేజీకి లాగిన్ చేయండి
*.‘మీ EPF బ్యాలెన్స్ తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి’పై క్లిక్ చేయండి..
*. ఇకపోతే epfoservices.in/epfo/కి మళ్లించబడతారు. ఇక్కడ కనిపించే బ్యాలెన్స్ సమాచారంలోకి వెళ్లండి.
* అప్పుడు మీ రాష్ట్రాన్ని ఎంచుకుని, ఈపీఎఫ్‌వోఆఫీస్ లింక్‌పై క్లిక్ చేయండి
* పీఎఫ్‌ ఖాతా నంబర్, పేరు, మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి
* తర్వాత ‘సమర్పించు’పై క్లిక్ చేయండి. అప్పుడు మీ పీఎఫ్‌ బ్యాలెన్స్‌ కనిపిస్తుంది...అంతే ఎంతో సులువుగా బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: