కస్టమర్లకు ఎస్బీఐ గుడ్ న్యూస్..పెరిగిన వడ్డీ రేట్లు..

Satvika
ప్రముఖ ప్రభుత్వ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది. దీనితో పాటు బ్యాంక్ ఎఫ్‌డీపై వడ్డీ రేట్లను పెంచింది.అయితే ఈసారి ఎస్‌బీఐ సీనియర్ సిటిజన్లకు ఎఫ్‌డీపై వడ్డీ రేటును పెంచింది. బ్యాంకు 5 సంవత్సరాల నుండి 10 సంవత్సరాలకు ఎఫ్‌డీల రేట్లను 7.25 శాతానికి పెంచింది. రూ.2 కోట్ల లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఈ రేట్లన్నీ సవరించింది..

పెరిగిన వడ్డీ రేట్లను చూస్తే..ఎస్‌బీఐ ఎంపిక చేసిన కాలపరిమితిపై 65 బేసిస్ పాయింట్ల వరకు ఎఫ్‌డీ రేట్లను పెంచింది. ఇవి డిసెంబర్ 13 నుండి అమలులోకి వచ్చాయి. సీనియర్ సిటిజన్‌లకు గరిష్ట వడ్డీ రేటు 7.25 శాతంజ. ఇది 1 సంవత్సరం నుండి 2 సంవత్సరాల వరకు, 2 సంవత్సరాల నుండి 3 సంవత్సరాల వరకు, 5 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల వరకు ఉన్న కాల వ్యవధికి అందుబాటులో ఉంటుంది.

సాధారణ కస్టమర్ల కోసం ఎఫ్‌డీ రేట్ల తాజా సవరణ తర్వాత ఎస్‌బీఐ 7 రోజుల నుండి 45 రోజుల వరకు 3 శాతం వడ్డీని అందిస్తోంది. పెట్టుబడిదారులు 46 రోజుల నుండి 179 రోజుల మధ్య ఎఫ్‌డీపై 3.9 శాతం, 180 రోజుల నుండి 210 రోజుల కంటే తక్కువ పథకాలకు 5.25 శాతం పొందుతారు. అదే సమయంలో 211 రోజుల నుండి 1 సంవత్సరం వరకు ఉన్న పథకాలకు బ్యాంక్ వడ్డీ రేటు 5.75 శాతం..

1 సంవత్సరం నుండి 2 సంవత్సరాల వరకు ఉన్న పథకాలకు బ్యాంక్ 6.75 శాతం ఆఫర్ చేస్తోంది. 2 సంవత్సరాల నుండి 3 సంవత్సరాల వరకు 6.75 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. 3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల వరకు, 5 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల వరకు ఈ పథకాలకు 6.25 శాతం వడ్డీ రేటును అందిస్తోంది..ఈ ఏడాది కొత్త ఆర్థిక సంవత్సరం మే  నుండి bank OF INDIA' target='_blank' title='రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాలసీ ఫలితాలకు అనుగుణంగా చాలా బ్యాంకులు తమ ఎఫ్‌డీ రేట్లను దూకుడుగా మార్చాయని, ఈ పెట్టుబడి ఎంపికను అనుసరించడానికి ఎక్కువ మంది పెట్టుబడిదారులను ఆకర్షించింది. మే నుంచి ఆర్‌బీఐ తన రెపో రేటును ఐదుసార్లు పెంచింది. మార్చి 4.40 శాతం నుంచి 6.25 శాతానికి పెంచింది..వచ్చే నెలలో మరింతగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: