రూ.500 లతో ఇన్వెస్ట్ చేస్తే..రూ.10 లక్షలు లాభం..పూర్తి వివరాలు..

Satvika
ఈరోజుల్లో ఎక్కువగా వాహనాల మీద వెళ్తున్న సంగతి తెలిసిందే..అలాగే రోజు రోజుకు ప్రమాదాలు కూడా పెరిగిపోతున్నాయి.మనం సరిగ్గా వెళ్లినా ఎదురుగా వచ్చే వాహనదారుడు సరిగ్గా వస్తాడన్న నమ్మకం లేదు. నిర్లక్ష్యం, అతివేగం తదితర కారణాల వల్ల దేశంలో ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరిగి ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. మనం ఎంత జాగ్రత్తగా వెళ్లినా ఎదుటి వ్యక్తి కారణంగా తీవ్ర ప్రమాదాలు తెచ్చిపెడుతుంది. దీంతో ఆస్పత్రుల్లో చేరిన తర్వాత లక్షల్లో గుమ్మరించుకోవాల్సిన పరిస్థితి వస్తుంటుంది. ఇలాంటి సందర్బంలో హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ఉండటం తప్పనిసరి. ఇలాంటి సమయంలో ప్రమాదంలో ప్రాణాలు పోతే కనీసం టర్మ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ కుటుంబానికి ఆసరాగా ఉంటుంది.

ఒక వేళ తీవ్ర గాయాలు అయినా, ఉద్యోగం పోయినా ఇలాంటి టర్మ్‌ ఇన్సూరెన్స్‌లు పనికిరావు..ఇలాంటి వాటికి భరోసా ఇస్తుంది ఈ పాలసీ..ఇకపోతే రోడ్డు ప్రమాదాలు ప్రమాదాలు జరిగినప్పుడు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. ఆరోగ్యం పూర్తిగా కుదుటపడేదాక సెలవుల్లో ఉండాల్సిందే. అలాంటప్పుడు సమ్‌ అష్యూర్డ్‌లో ఒక్క శాతం వరకూ బీమాదారుడికి చెల్లిస్తారు. అలాగే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన తర్వాత చేయించుకునే వైద్యం, మందులు ఇతర ఖర్చులకూ బీమా కవరేజీ వర్తిస్తుంది.

అంతేకాదు.. అదనంగా తీసుకునే ఆప్షన్స్‌ ద్వారా యాక్సిడెంటల్‌ హాస్పిటల్‌ డైలీ, వీక్లీ అలవెన్స్‌ వంటి ప్రయోజనాలను పొందవచ్చు. కొన్ని కంపెనీలు వారానికి గరిష్టంగా రూ.20 వేల వరకు చెల్లిస్తుంటాయి.ఈ పాలసీ తీసుకునేందుకు 18 నుంచి 65 సంవత్సరాల వయసు ఉన్నవారు అర్హులు. ఈ పాలసీ తరుచూ వాహనాల్లో ప్రయాణించేవారు, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లే ఉద్యోగులు, ఇతర పనుల నిమిత్తం వెళ్లేవారికి ఉపయోగకరంగా ఉంటుంది.ప్రతి బీమా సంస్థ ఈ పాలసీని ఇవ్వాల్సి ఉంటుంది. రూ.10 లక్షల ప్రమాద బీమా పాలసీకి గరిష్ఠంగా రూ.500-1,000 మధ్య ప్రీమియం ఉంటుంది. ఇందులో మెడికల్‌ ఖర్చులు, పిల్లల చదువు, ప్రమాదం అనంతరం సెలవులకు ఖర్చులు వంటి వాటికి యాడ్‌ ఆన్స్‌ వంటివి ఉన్నాయి. ఎస్బీఐ వంటి ప్రధాన బ్యాంకులు కూడా అతి తక్కువగా రూ.200 ప్రీమియంతో రూ.4 లక్షలకు బీమాను కల్పిస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: