ప్రభుత్వానికే కరెంటు అమ్ముతున్న.. ఈ గ్రామం గురించి తెలుసా?

praveen
సాధారణంగా ప్రభుత్వాలు అందించే విద్యుత్ పైన గ్రామాలు ఆధారపడటం గురించి ఇప్పటివరకు చూసాము. ఒకవేళ ఎక్కడైనా విద్యుత్ అంతరాయం ఏర్పడింది అంటే ముఖ్యంగా ఎన్నో గ్రామాలు ఇక అంధకారంలోకి వెళ్ళిపోతూ ఉంటాయి అని చెప్పాలి. ఇలా గ్రామాలు మొత్తం ఏకంగా ప్రభుత్వాలు అందించే విద్యుత్ మీద ఆధారపడి ఉంటాయి. కానీ ప్రభుత్వాలకే విద్యుత్ విక్రయించే గ్రామాలకు ఉంటాయా అంటే.. అలాంటి గ్రామాలు ఉండే ఛాన్సే లేదు అని చెబుతారు ప్రతి ఒక్కరు.కానీ అలా అనుకుంటే పప్పులో కాలేసినట్లే.  ఇక్కడ మాత్రం ఒక గ్రామం ప్రభుత్వం ఇచ్చే విద్యుత్ వినియోగించడం కాదు ప్రభుత్వానికి విద్యుత్ విక్రయిస్తుంది.

 ఇక ఈ గ్రామానికి సంబంధించిన వార్త కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరు కూడా ఇక ఆ గ్రామం సాధించిన దాని గురించి తెలిసి  షాక్ అవుతున్నారు. ఇంతకీ ఆ గ్రామం ఎక్కడో లేదు తమిళనాడులోని ఉంది అని చెప్పాలి. తమిళనాడు రాష్ట్రంలో వడంతూరై అనే గ్రామం ఇండియాలో మొదటిసారి 350 మెగావాట్ల విండ్ మిల్  ను కలిగిన మొదటి స్థానిక సంస్థగా గుర్తింపు పొందింది. ఈ క్రమంలోనే ప్రభుత్వం ఇచ్చే కరెంటును ఉపయోగించుకోవడం కాదు ప్రభుత్వానికే విద్యుత్ ను అమ్ముతుంది ఆ గ్రామం.

 2000 సంవత్సరానికి ముందు ఇక అన్ని గ్రామాల లాగానే ఆ గ్రామం కూడా ఎంతో సాధారణ గ్రామంగానే ఉండేది. ప్రభుత్వం ఇచ్చిన విద్యుత్ను వినియోగించుకొని ఇక అక్కడి ప్రజలు జీవనం సాగించేవారు. కానీ ఇక ఈ గ్రామం ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని ప్రభుత్వ పథకాలను వినియోగించుకొని గ్రామంలో సొంత నీటి సదుపాయం, అంతేకాకుండా సోలార్ విండ్ మిల్ ద్వారా విద్యుత్ని ఉత్పత్తి చేయడం మొదలు పెట్టింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఏకంగా ఆ విద్యుత్ను గ్రామంలో వినియోగించడమే కాదు ప్రభుత్వానికి కూడా అమ్మేస్తుంది. ఏకంగా ప్రతి ఏడాది 19 లక్షల వరకు విద్యుత్ను అమ్ముతుందట ఈ గ్రామం. ఇది తెలిసి ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు అని చెప్పాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: