ఆన్‌లైన్‌లో గ్యాస్ ను బుక్ చేస్తున్నారా?ఇలా చేస్తే క్యాష్ బ్యాక్ పక్కా..

Satvika
ఇప్పుడు అందరూ కూడా ఆన్‌లైన్‌ ద్వారా ఎమౌంట్ ను పే చేస్తున్నారు.అదే విధంగా బిల్లులను కూడా అక్కడి నుంచే చేస్తారు.అయితే ఇప్పుడు ఆన్లైన్ ద్వారా చేస్తున్న లావాదేవీలపై క్యాష్ బ్యాక్ ను కూడా అందిస్తున్నాయి.. ఏ చిన్న వస్తువు కావాలన్న స్మార్ట్‌ఫోన్‌ ఓపెన్‌ చేసి యాప్‌లో బుక్‌ చేసే రోజులు వచ్చేశాయి. అన్నీ ఆన్‌లైన్‌లోనే అన్నట్లు పరిస్థితులు మారాయి.ఆఖరికి గ్యాస్‌ సిలిండర్‌ను కూడా ఆన్‌లైన్‌లోనే బుక్‌ చేసుకుంటున్నారు. ఆన్‌లైన్‌ పేమెంట్స్‌ సంస్థలు రకరకాల ఆఫర్లను ప్రకటించడం కూడా దీనికి కారణంగా చెప్పొచ్చు. ఈ క్రమంలోనే ప్రముఖ ఆన్‌లైన్‌ పేమెంట్స్‌ సంస్థ పేటీం వినియోగదారులకు ఓ మంచి ఆఫర్‌ను అందించింది. ఆన్‌లైన్‌లో గ్యాస్‌ సిలిండర్‌ బుక్‌ చేసిన వారికి క్యాష్‌ బ్యాక్‌ను అందిస్తోంది. ఈ ఆఫర్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు చుద్దాము..

భారత్‌గ్యాస్‌, ఇండేన్‌, హెచ్‌పీ సంస్థలకు చెందిన ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్‌ బుకింగ్‌పై పేటీఎం క్యాష్‌బ్యాక్‌ అందిస్తోంది. పేటీఎం నుంచి మొదటిసారి గ్యాస్‌ బుక్‌ చేసుకున్న వారికి రూ. 15 క్యాష్‌బాక్‌ లభించనుంది. అలాగే పేటీఎం వ్యాలెట్‌ నుంచి సిలిండర్‌ బుక్‌ చేసుకుంటే రూ. 50 వరకు క్యాష్‌బ్యాక్‌ పొందొచ్చు. వీటికి అదనంగా కస్టమర్ల కోసం ట్రాకింగ్ ఆప్షన్‌ను కూడా అందించారు. దీని ద్వారా మీ సిలిండర్‌ ఎక్కడ ఉందన్న విషయాన్ని ట్రాక్‌ చేసుకోవచ్చు...అయితే ఈ ఆఫర్ అనేది ఒక్కసారి మాత్రమే వర్తిస్తుంది..

ఈ ఆఫర్ ను పొందడానికి కస్టమర్లు..FIRSTGAS” కోడ్‌, పేటీఎం వాలెట్‌ని ఉపయోగించి సిలిండర్‌ల బుకింగ్‌ చేసే యూజర్లు “WALLET50GAS” కోడ్‌ని ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. ఇక మొదటి బుకింగ్ తర్వాత, యాప్ బుకింగ్ వివరాలను కూడా సేవ్ చేస్తుంది, దీంతో తదుపరి బుకింగ్‌ కోసం యూజర్లు 17-అంకెల ఎల్‌పీజీ ఐడీ తదితర వివరాలను గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు..మీ రిజిస్టర్ అడ్రెస్ కు రెండు, మూడు రోజుల్లో గ్యాస్ సిలిందర్ దెలివరీ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: