అమరావతి : చివరి ఎన్నికలు..టీడీపీకా ? జనాలకా ?

Vijaya

ఏ రకంగా చూసినా చంద్రబాబునాయుడు పూర్తి అయోమయంలో ఉన్నట్లు అర్ధమైపోతోంది. కర్నూలు జిల్లాలో పర్యటించిన మూడురోజులు రాబోయే ఎన్నికల్లో టీడీపీని గెలిపించకపోతే అవే తనకు చివరి ఎన్నికలు అవుతాయని భోరుభోరున ఏడ్చినంత పనిచేశారు. పెద్దమనసు చేసుకుని ఎలాగైనా పార్టీని గెలిపించి తనను సీఎంను చేయాలని జనాలను బతిమలాడుకున్నారు. జనాలు పెద్దమనసు చేసుకోకపోతే రాబోయే ఎన్నికలే తనకు, టీడీపీకి చివరి ఎన్నికలని పదేపదే గుర్తుచేశారు.మూడురోజులయ్యేటప్పటికి చంద్రబాబు స్వరంలో మార్పొచ్చేసింది. చివరి ఎన్నికలంటే తనకు, టీడీపీకి కాదని ప్రజలకు, రాష్ట్రానికే అంటు మాట మార్చేశారు. మొదటి మాట్లాడిందానికి తర్వాత మాట్లాడిందానికి మధ్యన ఏమిజరిగింది ? ఏమి జరిగిందంటే ఎల్లోమీడియా అదిపతులు, కొందరు సీనియర్ నేతలు చంద్రబాబుతో మట్లాడారట. పార్టీకి చివరి ఎన్నికలన్నంత మాత్రాన జనాలు జాలిపడి టీడీపీకి ఓట్లేయరని గట్టిగా చెప్పారట. కాబట్టి చివరిఎన్నికలంటే  రాష్ట్రాభివృద్ధికి అని చెప్పాలన్నారట.దాంతో జరిగిన డ్యామేజీని గుర్తించిన చంద్రబాబు సానుభూతి ఓట్లు కాకుండా జనాలను బెదిరించటం మొదలుపెట్టారు. అయితే ఇక్కడ విషయం ఏమిటంటే చంద్రబాబు ఏ విధంగా చెప్పినా జనాలు తమిష్టప్రకారమే ఓట్లేస్తారు. చంద్రబాబు బతిమలాడుకున్నారనో లేకపోతే బెదిరిస్తున్నారనో టీడీపీకి ఓట్లేయరు. ఇక అసలు విషయానికి వస్తే జనాలు ఓట్లేయకపోతే టీడీపీ, చంద్రబాబుకు చివరి ఎన్నికలు అవుతాయే కానీ జనాలకో లేకపోతే రాష్ట్రానికో కావు. చంద్రబాబు, ఎల్లోమీడియా ఆరోపణలు చేస్తున్నట్లుగా, బురద చల్లేస్తున్నంత ఘోరమైన స్ధితిలో అయితే లేదు ఏపీ పరిస్ధితి. జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్లస్సులున్నాయి అలాగే మైనస్సులూ ఉన్నాయి. కాకపోతే ప్లస్సులను ఎల్లోమీడియా ఎక్కడా కనబడకుండా దాచేసి కేవలం మైనస్సులను మాత్రమే బాగా హైలైట్ చేస్తున్నది. దాన్నే చంద్రబాబు అండ్ కో విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. అయితే వీళ్ళంతా మరచిపోయిన విషయం ఏమిటంటే  జరిగే ప్లస్సులు ఆయా ప్రాంతాల్లోని జనాలకు బాగా తెలుసు. కాబట్టి ఏ విధంగా చూసినా చివరి ఎన్నికలు చంద్రబాబు, టీడీపీకే అని అర్దమైపోతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: