రాయలసీమ : రాయలసీమ నిజంగానే గర్జించిందా ?

Vijayaమూడురాజధానులకు మద్దతుగా, కర్నూలులో న్యాయరాజధాని ఏర్పాటుకావాలనే డిమాండ్ తో కర్నూలులో భారీ బహిరంగసభ జరిగింది. ఈ సభకు రాయలసీమకు చెందిన  మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంపీలు, సీనియర నేతలతో పాటు రాయలసీమ హక్కుల పోరాట సమితి లాంటి సంఘాల నేతలు కూడా పాల్గొన్నారు. ఉదయం నుండే కర్నూలు నగరంలోని రోడ్లన్నీజనాలతో నిండిపోయింది. విద్యార్ధులు, లాయర్లు, వర్తక, వాణిజ్యరంగాలకు చెందిన ప్రముఖులు, వివిధ ప్రజాసంఘాలు కూడా పెద్దఎత్తున ర్యాలీలు నిర్వహించాయి.బహిరంగసభకు జనాలు పోటెత్తింది మాత్రం వాస్తవమే. అయితే సభ నిర్వహణ ద్వారా మూడు రాజధానులకు, కర్నూలులో న్యాయరాజధాని ఏర్పాటు డిమాండును గట్టిగా వినిపించారా అన్నదే అనుమానం. ఎందుకంటే వక్తలు ఎక్కువమంది అయిపోవటంతో మాట్లాడాల్సిన సమయం  బాగా తగ్గిపోయింది. దాంతో మంత్రులు లేదా ప్రజాసంఘాల నేతలు తలా ఐదు నుండి పదినిముషాల కన్నా ఎక్కువగా మాట్లాడలేకపోయారు.దీనివల్ల ఏమైందంటే వక్తల్లో మూడు రాజధానులకు మద్దతుగా తమ ఆవేధనను జనాలందరికీ సక్రమంగా వినిపించలేకపోయారనే భావన పెరిగిపోతోంది. ఏదేమైనా జరిగిన బహిరంగసభ బాటమ్ లైన్  ఏమిటంటే కర్నూలులో న్యాయరాజధాని ఏర్పాటు చేయాలన్నదే. కాబట్టి ఈ విషయంలో మాత్రం అధికారపార్టీ గ్రాండ్ సక్సెస్ అయ్యిందనే చెప్పాలి. ఈ బహిరంగసభ ప్రతిపక్షాలకు ముఖ్యంగా చంద్రబాబునాయుడు అండ్ కోకి ఒక వార్నింగ్ లాగ పనిచేస్తుందనే అనుకోవాలి.మొన్ననే కర్నూలులో  పర్యటించిన చంద్రబాబు అమరావతికే జనాలు మద్దతు తెలిపారంటు పదేపదే చెప్పుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఇంతలోనే న్యాయరాజధానికి మద్దతుగా నిర్వహించిన బహిరంగసభ సక్సెస్ కావటంతో చంద్రబాబు అండ్ కో లో డెఫనెట్ గా టెన్షన్ మొదలయ్యే ఉంటుంది. మరి దీన్ని కౌంటర్ చేయటానికి చంద్రబాబు కానీ లేదా జనసేన అధినేత పవన్ కల్యాణ్ లేకపోతే ఇంకెవరైనా ఎలాంటి ప్రయత్నాలు చేస్తారు అనేది చూడాలి. చంద్రబాబు అమరావతికే జై కొట్టినా, జగన్ మూడురాజధానులని చెప్పినా అల్టిమేట్ గా డిసైడ్ చేయాల్సిందే జనాలు మాత్రమే అని అందరికీ తెలిసిందే. మరి రాబోయే కాలంలో ఎవరే పాత్రపోషిస్తారో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: