పవన్ కొత్త సినిమా డీ కోడింగ్ లో బిజీగా ఉన్న అభిమానులు !

Seetha Sailaja

రాజకీయాలలో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న ‘హరి హర వీరమల్లు’ తప్ప మరో సినిమాలో నటించడా అన్న అభిమానుల సందేహాలకు సమాధానం ఇస్తూ పవన్ లేటెస్ట్ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోష్టర్ కు విపరీతమైన స్పందన వచ్చింది. దర్శకుడు సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈమూవీకి సంబంధించిన పోష్టర్ లో అనేక ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతున్నాయి.

ఈమూవీకి సంబంధించిన ప్రీ లుక్ పోష్టర్ ను బట్టి ఈమూవీ కథ జపనీస్ మార్షల్ ఆర్ట్స్ కు సంబంధించింది అని తెలుస్తోంది. ఒక హై పవర్ యాక్షన్ డ్రామా తో  కథ ఉంటుందని లీకులు వస్తున్నాయి. ఈమూవీలో పవన్ కళ్యాణ్ ఒక పవర్ ఫుల్ గ్యాంగ్ ష్టర్ గా నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రీ లుక్ పోష్టర్ పై జపాన్ భాషలో అక్షరాలు ఒక ఛాయా మాత్రంగా కనిపిస్తున్న ఒక పెద్ద గన్ ను బట్టి పవన్ ఈమూవీలో ఒక ఇంటర్ నేషనల్ గ్యాంగ్ ష్టర్ గా స్టైలిష్ గా కనిపిస్తాడని అంటున్నారు.

జపనీస్ భాషలో వ్రాసిన ఆ అక్షరాలను ఇంగ్లీష్ లోకి తర్జిమా చేస్తే “Fire Storm is Coming.” అన్న అర్థం వస్తుంది. దీనితో అభిమానులు పవన్ ను ఎలాంటి పవర్ ఫుల్ పాత్రలో చూడాలని భావిస్తారో అలాంటి పాత్ర దర్శకుడు సుజిత్ పవన్ ను దృష్టిలో పెట్టుకుని ఈ పవర్ ఫుల్ కథను వ్రాసినట్లు అనిపిస్తోంది. వాస్తవానికి ‘గబ్బర్ సింగ్’ మూవీ తరువాత అభిమానులు కోరుకునే పవర్ ఫుల్ పాత్రలో ఏ దర్శకుడు పవన్ ను చూపించ లేకపోయారు.

ఇప్పుడు ఆలోటును దర్శకుడు సుజిత్ తీరుస్తాడా అన్న అంచనాలు వస్తున్నాయి. ‘సాహో’ విడుదల అయ్యేంతవరకు కూడ సుజిత్ ప్రభాస్ ను అద్బుతంగా చూపిస్తాడు అన్న ఆశలతో ప్రభాస్ అభిమానులు ఉన్నారు. అయితే మూవీ రిలీజ్ అయిన తరువాత జరిగింది వేరు. ‘సాహో’ తరువాత ఏ టాప్ హీరో సుజిత్ కు అవకాశాలు ఇవ్వకపోయినప్పటికీ అతడిని నమ్మి పవన్ ఇచ్చిన అవకాశాన్ని ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటాడో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: