ఒకసారి కడితే చాలు...ప్రతి నెల 20,000 పొందొచ్చు.. వివరాలు..

Satvika
ప్రభుత్వ భీమా కంపెనీ ఎల్ఐసీ కొత్త పాలసీలను అందిస్తున్న సంగతి తెలిసిందే..ఇన్సూరెన్స్‌ పథకాలతో పాటు తక్కువ ఇన్వెస్ట్‌మెంట్‌తో ఎక్కువ రాబడి వచ్చే పథకాలున్నాయి.వీటిలో ఇన్వెస్ట్ చెయ్యడానికి జనాలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఎల్‌ఐసీ ప్రవేశపెట్టిన పథకాల్లో 'జీవన్‌ అక్షయ్‌' పాలసీ ఒకటి. ఈ పథకంలో పెట్టుబడి పెట్టిన తర్వాత అధిక వడ్డీ సంపాదించడమే కాకుండా నిర్ణీత కాలం తర్వాత నెల వారీ లేదా మూడు నె లలు, వార్షిక ఆదాయాన్ని సంపాదించడం ప్రారంభించవచ్చు. ఈ పథకంలో సింగిల్‌ ప్రీమియంగా కనీస పెట్టుబడి లక్ష రూపాయలు. ఇందులో ఒక్కసారి ఇన్వెస్ట్‌మెంట్‌ చేస్తే నెలనెల పెద్ద మొత్తంలో అందుకోవచ్చు.

మీరు 30 నుండి 85 సంవత్సరాల మధ్య వయస్సు గల వ్యక్తి అయితే మీరు జీవన్ అక్షయ్ పాలసీని ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు. పథకంలో ఒక్క ప్రీమియంగా కనీస పెట్టుబడి రూ.1 లక్ష. జాయింట్ ఇన్వెస్టర్లు కూడా జీవన్ అక్షయ్ పాలసీలో పెట్టుబడి పెట్టవచ్చు. అయితే ఒక్కో పెట్టుబడిదారుడు ఒక్కొక్కరుగా రూ.లక్ష పెట్టుబడి పెట్టాలి. మీరు మొత్తాన్ని పెట్టుబడి పెట్టిన తర్వాత మీరు మీ నెలవారీ పెన్షన్‌ను పొందుతారు. ఎంత ఎక్కువ పెట్టుబడి పెడితే అంత ఎక్కువ పెన్షన్ వస్తుంది.

ఎల్‌ఐసీ జీవన్ అక్షయ్ పాలసీలో అందుబాటులో ఉన్న 10 కంటే ఎక్కువ యాన్యుటీ ఆప్షన్స్‌ను అందిస్తుంది. పాలసీ తీసుకునే ప్రారంభంలోనే పాలసీదారు గ్యారెంటీ యాన్యుటీ రేటును పొందుతారు. మీరు ఎంచుకున్న ఆప్షన్‌ను బట్టి పెట్టుబడుల రాబడి కొద్దిగా మారుతూ ఉంటుంది..ఇకపోతే ఒకేసారి రూ.9,16,200 జమ చేసినట్లయితే.. నెలకు రూ.6,859 రాబడి పొందే అవకాశం ఉంటుంది. అదే విధంగా సంవత్సరానికి రూ.86,265 లేదా అర్ధ సంవత్సరానికి రూ42,008, లేదా త్రైమాసిక ప్రాతిపదికన రూ.20,745 పొందుతారు. అలాగే రూ. 30 లక్షల పెట్టుబడి పెడితే.. ప్రతి నెలా రూ. 14,000 పెన్షన్ పొందవచ్చు. అలాకాకుండా సంవత్సరానికి ఒకసారి తీసుకుంటే.. రూ. 1,68,000 డబ్బు అందుకోవచ్చు. నెలకు రూ.20,000 పెన్షన్ తీసుకోవాలంటే దాదాపు రూ.40 లక్షలు పెట్టుబడి పెట్టాలి..పన్ను మినహాయింపు ఉందట..బ్రతికి ఉన్నంత కాలం మీకు డబ్బులు వస్తాయి.ఒక వేళ మరణిస్తే పెట్టుబడి వెనక్కి వస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: