ఎస్బీఐ బంఫర్ ఆఫర్..బ్యాంకుకు వెళ్ళకుండానే లోన్ పొందే అవకాశం..

Satvika
ప్రముఖ ప్రభుత్వ బ్యాంకు ఎస్బీఐ కస్టమర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది..బ్యాంకుకు వెళ్ళకుండానే క్షణాల్లో లోన్ పొందవచ్చుఅని తెలిపింది.అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంచింది. డబ్బులతో అవసరం ఉన్న వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఎస్‌బీఐ కస్టమర్లకు ఇన్‌స్టంట్ ప్రి అప్రూవ్డ్ పర్సనల్ లోన్స్ అందిస్తోంది. వీటి కోస బ్యాంక్‌కు వెళ్లాల్సిన పని లేదు. ఇంట్లో నుంచే సులభంగా అప్లై చేసుకోవచ్చు. డబ్బులు క్షణాల వ్యవధిలో బ్యాంక్ అకౌంట్‌లోకి వచ్చి చేరతాయి.

అంతేకాదు..స్టేట్ బ్యాంక్ ప్రత్యే సేవలు కూడా అందిస్తోంది. ప్రాసెసింగ్ ఫీజు మాఫీ బెనిఫిట్ పొందొచ్చు. ఇంకా ఏకంగా అర్హత కలిగిన కస్టమర్లు పర్సనల్ లోన్స్ కింద బ్యాంక్ నుంచి రూ. 35 లక్షల వరకు రుణం పొందొచ్చు..ఇందుకు అర్హత కలిగిన కస్టమర్లకు ప్రి అప్రూవ్డ్ రుణాలు అందిస్తోంది. ప్రిఅప్రూవ్డ్ లోన్ ఆఫర్ కలిగిన వారికి రూ. 8 లక్షల వరకు రుణం లభిస్తుంది. ఎస్‌బీఐ యోనో లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఈ లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. డబ్బులు వెంటనే అకౌంట్‌లోకి వచ్చేస్తాయి..

బ్యాంక్‌కు వెళ్లకుండానే ఆన్‌లైన్‌లోనే ప్రి అప్రూవ్డ్ లోన్ కింద వెంటనే రూ. 8 లక్షల దాకా పొందొచ్చు..ఈ విషయాన్ని ఎస్బీఐ సోషల్ మీడియా ద్వారా తెలిపింది.ఎస్‌బీఐ కస్టమర్లు పీఏపీఎల్ అన టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఎస్‌బీఐ అకౌంట్ చివరి నాలుగు అంకెలు ఎంటర్ చేసి 567676 నెంబర్‌కు ఎస్‌ఎంఎస్ పంపిస్తే సరిపోతుంది.ఎంత లోన్ అవసరమో ఎంచుకోవాలి. అలాగే టెన్యూర్ ఎంపిక చేసుకోవాలి. ఇంకా వడ్డీ రేటు, ఈఎంఐ వంటి అంశాలను చెక్ చేసుకోవాలి. తర్వాత కంటిన్యూ చేయాలి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఎంటర్ చేయాలి. అంతే డబ్బులు మీ అకౌంట్‌లోకి వచ్చేస్తాయి..ఇకపోతే ప్రతి నెలా ఈఎంఐ కట్ అవుతూ వస్తుంది. ఎక్కువ టెన్యూర్ ఎంచుకుంటే తక్కువ ఈఎంఐ పడుతుంది. అదే తక్కువ టెన్యూర్ అయితే ఎక్కువ ఈఎంఐ వస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: