షాకింగ్ న్యూస్..ఆ పథకంలో కీలక మార్పులు చేసిన కేంద్రం..

Satvika
మోడీ ప్రభుత్వం రైతుల కోసం అందుబాటులోకి తీసుకొని వచ్చిన పథకాలలో ఒకటి ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన.. ఈ పథకం కింద మోదీ సర్కార్ రైతుల పంటలకు బీమా సౌకర్యం అందిస్తుంది. వర్షాలు, వరదలు తదితర ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంటలు దెబ్బతిన్న రైతులకు ఈ పథకం కింద పరిహారాన్ని అందించనుంది..

విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తోంది. అయితే.. ఇప్పుడు ప్రభుత్వం ఈ పథకం లో భారీగా మార్పులు చేయాలని చూస్తోంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఈ సంవత్సరం దేశంలో ని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, కురిసిన నేపథ్యంలో పంటలకు తీవ్ర నష్టం కలిగింది. వాతావరణ సంక్షోభం, వాతావరణ మార్పుల కారణంగా ప్రభుత్వం ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనలో రైతుల ప్రయోజనాల ను దృష్టి లో ఉంచుకుని భారీ మార్పులు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది..ఇకపోతే దేశంలో ని మరింత మంది రైతులకు సాయం చేయాలని మోదీ సర్కార్ భావిస్తోంది. ఈ విషయంపై వ్యవసాయ కార్యదర్శి మనోజ్ అహుజా మాట్లాడుతూ.. వాతావరణ సంక్షోభం, సాంకేతికతకు అనుగుణంగా ప్రభుత్వం ఈ మార్పులు చేయనుందిని తెలియ చేశారు.. ఫసల్ బీమా కోసం రైతులు ముందుగా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఖరీఫ్ పంట కోసం, మీరు బీమా మొత్తంలో 2% వరకు ప్రీమియం చెల్లించాలి. రబీ పంటకు 1.5 శాతం వరకు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో ఈ పథకం ను రిజిస్టర్‌ చేసుకొవాల్సి ఉంటుంది.. దగ్గరిలోని బ్యాంక్ బ్రాంచ్‌ కోఆపరేటివ్ బ్యాంక్, పబ్లిక్ సర్వీస్ సెంటర్, లేదంటే ఆథరైజ్డ్ ఇన్సూరెన్స్ కంపెనీల వద్దకు వెళ్లి కూడా రిజిస్టర్ చేసుకోవాలి..https://pmfby.gov.in/ వెబ్ సైట్లోనూ రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇంకా.. క్లెయిమ్ కూడా ఆన్‌లైన్‌లోనే చేసుకునే అవకాశం ఉంటుంది. దీనికి సంబందించిన స్టేటస్ కూడా ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవచ్చు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: