పీఎం ఫసల్ బీమా యోజన స్కీమ్ లో మార్పులు..పూర్తీ వివరాలు..

Satvika
భారత ప్రధాని మోదీ ప్రభుత్వం ఎన్నో రకాల సంక్షేమ పథకాలను అందుబాటులోకి తీసుకొని వచ్చింది.అందులో ఒకటి పీఎం ఫసల్ బీమా యోజన స్కీమ్..రైతుల ప్రయోజనం కోసం కేంద్ర ప్రభుత్వంచే అమలు చేయబడిన పథకం. ఈ పథకం కింద ప్రభుత్వం రైతుల పంటలకు బీమా సౌకర్యం (పీఎంఎఫ్బీవై) అందిస్తుంది. వాతావరణం, ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నాశనమైతే మోడీ ప్రభుత్వం రైతులకు పరిహారం అందజేస్తుంది. ఇది కష్టాల్లో ఉన్న రైతులకు అతిపెద్ద ఆర్థిక సహాయం అందజేస్తుంది. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఈ పథకంలో పెద్ద మార్పులు చేయాలని యోచిస్తోంది.

ఈ ఏడాది దేశంలోని ఒరిస్సా, మహారాష్ట్ర, హర్యానా, పంజాబ్ వంటి పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. అదే సమయంలో ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ వంటి దేశంలోని కొన్ని ప్రాంతాల్లో చాలా వర్షాలు కురిశాయి. దీంతో రైతుల పంటలైన వరి తదితర పంటలు చాలా నష్టపోయాయి.పంటలకు భీమా కూడా పెరగవచ్చునని అధికారులు చెబుతున్నారు.ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలపై ఎక్కువ శ్రద్ధ చూపుతుంది. పీఎం ఫసల్ బీమా యోజన ప్రయోజనాన్ని పొందాలనుకుంటే మీరు నిర్ణీత ప్రీమియం చెల్లించాలి.

ఈ ప్రీమియం చాలా తక్కువ. ఖరీఫ్ పంట కోసం, మీరు బీమా మొత్తంలో 2% వరకు ప్రీమియం చెల్లించాలి. మరోవైపు రబీ పంటకు 1.5 శాతం వరకు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అలాగే వాణిజ్య, ఉద్యాన పంటలకు మొత్తం ప్రీమియంలో గరిష్టంగా 5 శాతం చెల్లించాలి.స్కీమ్ కింద రిజిస్టర్ చేసుకోవడం చాలా సులభం. రైతులు ఈ స్కీమ్ ప్రయోజనాలను సులభంగానే పొందవచ్చు. ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ ద్వారా ఈ స్కీమ్‌లో రిజిస్టర్ చేసుకోవచ్చు. దగ్గరిలోని బ్యాంక్ బ్రాంచ్‌ కోఆపరేటివ్ బ్యాంక్, పబ్లిక్ సర్వీస్ సెంటర్, లేదంటే ఆథరైజ్డ్ ఇన్సూరెన్స్ కంపెనీ వద్దకు వెళ్లి రిజిస్టర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఆన్‌లైన్‌లో కూడా పంట బీమా కోసం నమోదు చేసుకోవచ్చు. దీని కోసం పీఎంఎఫ్‌బీవై వెబ్‌సైట్‌లోక వెళ్లాలి. అలాగే క్లెయిమ్ కూడా ఆన్‌లైన్‌లోనే చేసుకోవచ్చు. అలాగే క్లైయిమ్ కూడా చేసుకోవచ్చు..ఫిర్యాదు లు కూడా చేసుకోవచ్చు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: