జగన్ నిర్ణయంతో వణుకుతున్న వైసీపీ లీడర్స్ !

VAMSI
ఏపీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయాలలో తక్కువ అనుభవం ఉన్నప్పటికీ ఎప్పటికప్పుడు తాను వేసే వ్యూహా ప్రతి వ్యూహాలకు అటు ప్రతిపక్షములో దడపుట్టించడమే కాకుండా, సొంత పార్టీ నాయకులను కూడా సెట్ రైట్ చేస్తున్నారు. ఒకరు ఆలోచించేలా ఎప్పుడూ జగన్ ఆలోచన ఉండదు, పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేసుకుంటూ పోతారు. ఇక తాను నమ్మిన సిద్ధాంతాన్ని అమలు చేయడంలో ఎవరు చెప్పిన వెనకడుగు వేయడానికి అసలు ఆలోచించడు. మాములుగా ఏ పార్టీ అయినా కొందరికి ఒక విధంగా మరి కొందరికి ఇంకో విధంగా నియమాలు పద్దతులలో సడలింపులు చేయడం చూసి ఉంటారు.
కానీ జగన్ మాత్రం... అందరినీ ఒకేలా చూస్తూ పార్టీని అభివృద్ధి పధంలో నడపడమే ద్యేయంగా పెట్టుకుని ముందుకు వెళుతారు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణే తాజాగా జిల్లా అధ్యక్షుల విషయంలో జగన్ నిస్పక్షపాతంగా తీసుకున్న నిర్ణయాలు. ఈ టాపిక్ ఇప్పుడు రాష్ట్రము అంతటా హాట్ హాట్ గా చర్చ జరుగుతోంది. నిన్న మొన్నటి వరకు నాయకులకు తమ బాధ్యతలను గుర్తు చేసినా, కొందరు విన్నట్టే విని గాలికి వదిలేశారు. అయితే వారికి సరైన సమయంలో సరిగ్గా తన నిర్ణయంతో సమాధానం చెప్పారు. ముఖ్యంగా పార్టీలో కీలక వ్యక్తులు అని కార్యకర్తలు భావించిన వారికి సైతం షాక్ ఇచ్చారు.
ప్రభుత్వ సలహాదారుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి, కొడాలి నాని, బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి మరియు అనిల్ కుమార్ యాదవ్ లను సైతం పార్టీ పదవుల నుండి ఉద్వాసన పలకడం చర్చనీయాంశమైంది. ఇలా నిర్ణయం తీసుకోవడానికి కారణం ఆయా నాయకుల పసలేని పనితీరే కారణం అని తెలుస్తోంది. జగన్ అనుకుంది చేసి తీరుతాడు అనడానికి స్పష్టమైన సంకేతం అని చెప్పాలి. ఇప్పుడు వైసీపీలో ఉన్న ఎమ్మెల్యే మరియు ఎంపీలు వణుకుతున్నారు, ఇంకా కొందరు వచ్చే ఎన్నికల్లో తమకు సీట్లు దొరుకుతాయో లేదా అని ఆలోచనలో పడ్డారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: