ఎల్ఐసీలో మరో ప్లాన్..ఒక్కసారి ఇందులో ఇన్వెస్ట్ చేస్తే చాలు..

Satvika
ఎల్ఐసీ లో ఎన్నో కొత్త కొత్త ప్లాన్‌ లను అందుబాటులోకి తీసుకొని వస్తున్నారు..కస్టమర్లకు అందుబాటులో ఉండేలా సరికొత్త పథకాలను ప్రవేశపెడుతోంది. ఇక పదవీ విరమణ చేసిన తర్వాత ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించేందుకు సరికొత్త పథకాలు అందుబాటులోకి వస్తున్నాయి..వాటి వల్ల మంచి ఆదరణ పొందడంతో ఎక్కువ మంది ఈ పాలసీలను తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు.అందుకే కంపెనీ మరిన్ని పాలసీలను తీసుకోవడానికి ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తున్నారు.

పదవీ విరమణ తర్వాత మీకు ప్రతి నెలా 20 వేల రూపాయలు లభిస్తే, మీ ఇంటి ఖర్చులు సులభంగా తీర్చవచ్చు.



ఇందులో భాగంగా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మీ కోసం ఒక గొప్ప ప్లాన్‌తో ముందుకు వచ్చింది.ఎల్‌ఐసీ మీ కోసం జీవన్ అక్షయ్ ప్లాన్‌ని తీసుకొచ్చింది. ఇది భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వ బీమా కంపెనీ. ఇందులో పెట్టుబడి పెట్టడం చాలా సురక్షితమైనదిగా పరిగణించబడుతుంది. మీరు ఎల్‌ఐసీ పాలసీని కొనుగోలు చేయాలనుకుంటే అద్భుతమైన ఆప్షన్స్‌ ఉన్నాయి. ఈ పాలసీలో మీరు ఒక్కసారి మాత్రమే పెట్టుబడి పెట్టాలి. ఆ తర్వాత మీరు ప్రతి నెల, త్రైమాసికం, అర్ధ సంవత్సరం, వార్షిక ప్రాతిపదికన పెన్షన్ పొందవచ్చు..



75 ఏళ్లు నిండితే ప్రతి నెలా ఇంత పెన్షన్ వస్తుంది. మీరు రూ.610800 ఒకేసారి ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. దీనిపై అతని హామీ మొత్తం రూ.6 లక్షలు. ఈ విధంగా వార్షిక పింఛను రూ.76 వేల 650, అర్ధవార్షిక పింఛను రూ.37 వేల 35, త్రైమాసిక పింఛన్ రూ.18 వేల 225, ఇక మీకు నెలవారీ పెన్షన్ కావాలంటే 6 వేల 08 రూపాయలు వస్తుంది.ఈ పెన్షన్ పెట్టుబడిదారునికి జీవితాంతం అంటే మరణించే వరకు అందుబాటులో ఉంటుంది. ప్రతినెలా రూ.20 వేలు పింఛన్ తీసుకోవాలనుకుంటే ఒకేసారి రూ. 40,72,000 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుందని పాలసీ నివేదికలు చెబుతున్నాయి..ఈ పాలసీ ప్రయోజనాలు.. జీవన్ అక్షయ్ ప్లాన్ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మీరు ఈ పాలసీని కొనుగోలు చేసిన 3 నెలల తర్వాత రుణం తీసుకునే సదుపాయం ఉంటుంది. ఈ పాలసీలో పెట్టుబడికి గరిష్ట పరిమితి లేదు. మీరు ఈ పథకంలో కనీసం 1 లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టాలి..అప్పుడే మంచి లాభాలను పొందొచ్చు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: