బాలయ్య "అన్ స్టాపబుల్" షోకు షర్మిలక్క.. జగన్ టార్గెట్ !

VAMSI
ప్రస్తుతం "ఆహా" ఓటిటి ఛానెల్ లో గత రెండు సీజన్ లుగా తెలుగు ప్రజలను ఎంతగానో అలరిస్తూ ముందుకు సాగుతోంది. సీజన్ 2 లో మొదటి ఎపిసోడ్ కు రాజకీయ కోణంలో అలోచించి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరియు అతని కుమారుడు నారా లోకేష్ లను ఆహ్వానించి ఒక్కసారిగా ఆ షో ను ఒక రేంజ్ కు తీసుకు వెళ్లారు. అందుకే తర్వాత ఈ షోలో రాబోయే ఎపిసోడ్ లపై అంచనాలు బాగా పెరిగిపోయాయి. ఆ తరువాత ఎపిసోడ్ లో యువ కథానాయకులు సిద్దు జొన్నలగడ్డ మరియు విశ్వక్ సేన్ లను తీసుకువచ్చి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశారు. కాగా నెక్స్ట్ ఎపిసోడ్ కు శర్వానంద్ మరియు అడవి శేష్ లను తీసుకువస్తున్నారు.
అయితే ఓటిటి వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం వచ్చే వారం ప్రసారం కానున్న షోకు ఏపీ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు, ప్రస్తుత సీఎం జగన్ చెల్లెలు రానున్నారట. ప్రస్తుతం వైఎస్ షర్మిల తెలంగాణాలో వైఎస్సార్ టీపీ ని స్థాపించి తన నాన్న ఆశయాలను పూర్తి స్థాయిలో ప్రజలకు అందించాలన్న సదుద్దేశంతో ముందుకు వెళుతున్నారు. అయితే ఈమె తెలంగాణాలో పార్టీ పెట్టడం జగన్ కు ఇష్టం లేదని... జగన్ తో విబేధాలు ఉన్నాయని వార్తలు హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొద్ది రోజులకే జగన్ కు బద్ద శత్రువుగా భావించే ఏ బి ఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే షోకు వెళ్లి జగన్ ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేసింది.
ఇప్పుడు ఈ షోకు కనుక షర్మిల వచ్చేది నిజం అయితే... టీడీపీ బాలకృష్ణ ద్వారా జగన్ ను అవమానించడమే పనిగా పెట్టుకునే అవకాశం ఉంది. ఈ విధంగా మరోసారి షర్మిల ద్వారా జగన్ ను దెబ్బతీయాలని ఆలోచిస్తున్నారు. మరి వీరి ప్లాన్ వర్క్ అవుట్ అవుతుందా ? అస్సలు షర్మిల ఈ షోకు వస్తుందా అన్నది తెలియాలంటే వచ్చే వారం వరకు ఆగాల్సిందే.  
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: