కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్ న్యూస్..త్వరలోనే పెరగనున్న జీతం..

Satvika
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ ను చెప్పింది. ఇప్పటికే దసరా, దీపావళి సందర్భంగా బోనస్, డీఏ, డీఆర్ ను కేంద్రం పెంచిన విషయం తెలిసిందే. తాజాగా మరో గుడ్ న్యూస్ ను కేంద్రం అందిస్తోంది. అదే ఫిట్ మెంట్ కు సంబంధించి. ఫిట్ మెంట్ కు సంబంధించి కేంద్రం నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ఏడో వేతన సంఘం సిఫారసు మేరకు ఫిట్ మెంట్ ను పెంచేందు కు కేంద్రం యోచిస్తోంది. ఫిట్ మెంట్ పెరిగితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బేసిక్ వేతనం పెరగనుంది.

దానికి సంబంధించి ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ఫిట్ మెంట్ పెరిగితే 52 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీగా జీతాలు పెరుగనున్నాయి. అయితే.. ఫిట్ మెంట్ పెంచాలని, తమ జీతాలు పెంచాలని చాలా రోజుల నుంచి ప్రభుత్వ ఉద్యోగులు కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం 2.57 శాతంతో ఫిట్ మెంట్ ను ఉద్యోగు లకు ఇస్తున్నారు. దీన్ని 3.68 కు పెంచే అవకాశం ఉంది. 3.68 శాతాని కి పెంచితే ఒక్క సారిగా జీతాలు పెరగనున్నాయి. 2.57 నుంచి 3.68 కు ఫిట్ మెంట్ పెంచితే బేసిక్ వేతనం 18 వేల నుంచి 26 వేలకు పెరుగుతుంది.

2017 లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెరిగాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్లీ జీతాలు పెరగలేదు. మధ్యలో డీఏ పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కనీసం రూ.18 వేల మూల వేతనాన్ని, గరిష్ఠంగా రూ.56,900 మూల వేతనాన్ని పొందుతున్నారు. ఇప్పుడు ఫిట్ మెంట్ పెంచితే హైలేవల్ ఉద్యోగుల వేతనం కనీసం రూ.50 వేల వరకు పెరగనుంది.. మరో ఏడాదికి ఇది డబల్ అయ్యే అవకాశం కూడా ఉంది.. ఇది నిజంగానే గుడ్ న్యూస్ అనే చెప్పాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: