నారా లోకేష్ గెలిచే నియోజకవర్గం అదే ?

VAMSI
మాములుగా రాజకీయాలలో ఒక కుటుంబం నుండి ఒక నాయకుడు వచ్చి సక్సెస్ అయ్యారు అంటే... ఖచ్చితంగా కొంతకాలానికి అదే కుటుంబం నుండి వారి వారసులు రాజకీయాల్లోకి రావడం ఒక హక్కుగా అయిపోయింది. అయితే ఇలా వచ్చిన వారిలో చాలా వరకు సక్సెస్ అయిన శాతం తక్కువే అని చెప్పాలి. ప్రజలు అందరినీ స్వాగతించి ఆశీర్వదించరు, అందుకు వారిలో సేవాభావం, నిజాయితీ, ప్రజలపై పూర్తి విశ్వాసం ఉండాలి.. అప్పుడే ఎవరైనా రాజకీయాల్లో సక్సెస్ అవుతారు. ఏపీలో అలా ప్రజల్లోకి వచ్చిన ముఖ్యనాయకుల వారసులతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒకరు...జగన్ తండ్రి వైఎస్సార్ రాజకీయంగా మరియు వ్యక్తిగతంగా ప్రజలకు చేసిన సేవలను ఇప్పటికీ గుర్తుంచుకుని జేజేలు పలుకుతున్నారు.
అదే కుటుంబం నుండి ఆయన వారసుడిగా జగన్ వచ్చి సక్సెస్ అయ్యారు.. సొంతంగా పార్టీ పెట్టిన రెండవ ఎన్నికలకే అఖండ మెజారిటీ సాధించి సీఎం అయ్యారు. ఇక అదే విధంగా మాజీ సీఎం మరియు టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు రాజకీయ వారసుడిగా నారా లోకేష్ ఎంట్రీ ఇచ్చాడు. చంద్రన్న సీఎం గా ఉన్నప్పుడు లోకేష్ ను ఎమ్మెల్సీ చేసి ఐటీ శాఖకు మంత్రిని చేశాడు. అయితే ఆ తర్వాత జరిగిన 2019 ఎన్నికల్లో మంగళగిరి నుండి పోటీ చేసి తన సమీప వైసీపీ అభ్యర్థి ఆళ్ళ రామకృష్ణ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యాడు. అప్పటి నుండి "పండిత పుత్ర పరమ సుంటహ" అన్న కామెంట్ చేస్తూ రాజకీయ పార్టీలు కవ్విస్తున్నాయి.
ఇక రానున్న ఎన్నికలలో లోకేష్ ను ఎలాగైనా గెలిపించాలని చంద్రన్న వ్యూహాలు రచిస్తున్నారు. లోకేష్ రాజకీయ అరంగేట్రం సరిగా జరగలేదు.. మరి నెక్స్ట్ ఎన్నికలలో కూడా అదే నియోజకవర్గం నుండి పోటీ చేస్తాడా లేదా ఇంకేదైనా సేఫ్ నియోజకవర్గాన్ని ఎంచుకుంటాడా అన్నది తెలియాల్సి ఉంది. కానీ రాజకీయ విశ్లేషకుల నుండి అందుతున్న సమాచారం ప్రకారం టీడీపీకి కంచుకోట అయిన నియోజకవర్గాన్ని తనకు కేటాయించి అయినా సరే లోకేష్ ను ఎమ్మెల్యే చేయడానికి కంకణం కట్టుకున్నది చంద్రన్న.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: