దారుణం: వేదం నేర్పమంటే నరకం చూపించి చంపేశారు?

Purushottham Vinay
వేద విద్యను నేర్చుకోడానికి వచ్చిన ఓ విద్యార్థిని.. గురువు, ఇంకా అతని భార్య కలిసి చాలా దారుణంగా హింసించి హతమార్చారు. పోలీసులు కూడా అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి చేతులు దులిపేసుకున్నారు. రెండేళ్లుగా ఆ కేసుని మన గొప్ప పోలీసులు పట్టించుకోక మరుగున పడిపోయింది.ఇటీవల ఓ పోలీసు అధికారి దీనిపై కూపీ లాగితే అసలు విషయం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్నూలు నగరం సమీపంలోని ఎదురూరు గ్రామానికి చెందిన సువర్ణ, మహేష్‌ దంపతుల కుమారుడు మధుకుమార్‌ శర్మ (పాపం ఆ చిన్నారి చనిపోయే నాటికి 13 ఏళ్లు). తమ కుమారుడిని శ్రీశైలం మండలం సున్నిపెంటలో రామశర్మ, శిరీష దంపతులు నిర్వహిస్తున్న ప్రైవేటు వేద పాఠశాలలో చేర్పించారు.ఆ దుర్మార్గులు రామశర్మ దంపతులు మధుకుమార్‌ శర్మతో ఇంటి పని, వంటపని చేయించుకునే వారు. మాట వినకపోతే దూషించడంతో పాటు తీవ్రంగా కొట్టేవారు. ఈ క్రమంలో ఓరోజు యజ్ఞం చేసే సమయంలో చెప్పిన మాట వినలేదని మధుకుమార్‌ ఒంటిపై వాతలు పెట్టి చీకటి గదిలో నిర్బంధించారు. ఆరు రోజుల తర్వాత గది తలుపు తెరిచి చూస్తే పాపం ఆ విద్యార్థి చనిపోయి ఉన్నాడు.


ఈ ఘటనపై విద్యార్థి తండ్రి ఇచ్చిన ఫిర్యాదుపై 2020 జులై 7న శ్రీశైలం రెండో పట్టణ పోలీసు స్టేషన్‌లో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. విద్యార్థి ఆహారం, నీరు లేక మరణించాడంటూ కొద్దిరోజుల తర్వాత పోస్టుమార్టం నివేదిక అందింది. తర్వాత కేసు విచారణను మరుగున పడేశారు.ఆత్మకూరు డీఎస్పీ శ్రుతి ఇటీవల శ్రీశైలం పోలీసు స్టేషన్‌ను తనిఖీ చేశారు. ఈ కేసు వివరాలను పరిశీలించిన ఆమె..విద్యార్థి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు, పోస్టుమార్టం నివేదికలో వ్యత్యాసాన్ని గమనించి పునర్విచారణకు ఆదేశించారు. నందికొట్కూరు సీఐ సుధాకర్‌రెడ్డిని విచారణ అధికారిగా నియమించారు. గురువు దంపతులు వాతలు పెట్టడంతోనే విద్యార్థి మృతి చెందినట్లు సీఐ నిర్ధారించారు. అనుమానాస్పద మృతిని హత్యగా మార్చి కేసు నమోదు చేశారు. రామశర్మ, శిరీష దంపతులను అరెస్టు చేసి ఈ నెల 11న రిమాండుకు తరలించారు.అంత దారుణంగా చిన్నారికి నరకయాతనకి గురి చేసిన ఆ దుష్ట దంపతులని ఇంకా ఇంత దారుణం జరిగిన పట్టించుకోని పోలీసు మహానుభావుల్ని ఏమనాలి.. ఏ విధంగా శిక్షించాలి? మీ అభిప్రాయం తెలియజేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: