తెలుగు రాష్ట్రాలలో ముంచెత్తుతున్న భారీ వర్షాలు..

Satvika
దేశ మొత్తం భారీగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.. గత కొద్ది రోజులు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా చాలా ప్రాంతాలు నీట మునిగాయి.కొన్ని ప్రాంతాల లో అన్నీ కోల్పోయి రోడ్డున పడ్డారు.బంగాళాఖతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలో ముఖ్యంగా కోస్తాంధ్ర ప్రాంతాలపై అల్పపీడనం ప్రభావం చూపుతోంది.నేడు సైతం పలు జిల్లాలకు వర్ష సూచనతో అమరావతి, హైదరాబాద్ వాతావరణ కేంద్రాలు ఎల్లో అలర్ట్ జారీ చేశాయి. ఈశాన్య రుతుపవనాలు అక్టోబర్ 15 ఏపీలోకి ప్రవేశించనున్నాయని ఏపీ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. తెలుగు రాష్ట్రాల్లో కొన్నిచోట్ల వర్షాలు తగ్గుముఖం పట్టినా, మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలతో నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.


పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, దాని అనుబంధ ఉపరితల ఆవర్తనం శ్రీలంక ఉత్తర తీరానికి సమీపంలో సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది.మరో మూడు రోజుల వరకు ఉండనుంది. కొన్ని జిల్లాలకు వర్ష సూచనతో కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. అక్టోబర్ 15 వరకు తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. నిన్న జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురిసాయి.

ఈ రోజు కోస్తాంధ్రలో వర్షాలు జోరుగా కురవనున్నాయి. తెల్లవారుజాము నుంచి మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కొనసీమ, ఏలూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో వర్షాలు పడతాయి. సాయంకాలం వరకు వర్షం పడుతుందని అంచనా వేశారు. విశాఖ, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మణ్యం జిల్లాల్లో మధ్యాహ్న వరకు వర్షాలు కొనసాగి రాత్రికి తగ్గుముఖం పట్టనున్నాయి. తీరంలో 50 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో నైరుతి, తూర్పు బంగాళాఖాతం దిశల నుంచి గాలులు వీస్తున్నాయని, మత్స్యకారులు వేటకు వెళ్లడం క్షేమదాయకం కాదని అధికారులు హెచ్చరించారు.

నేడు బాపట్ల, ఉత్తర ప్రకాశం, కృష్ణా, ఎన్.టీ.ఆర్. జిల్లాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. నెల్లూరు జిల్లాలోని నెల్లూరు నగరానికి పశ్చిమ భాగాల్లోని ప్రాంతాలు, తిరుపతి జిల్లా గూడూరు ప్రాంతంలో మోస్తరు వర్షాలు పడతాయి. రాయలసీమ జిల్లాల్లో ఈ రోజు అక్కడక్కడ మాత్రమే వర్షాలున్నాయి. కానీ అనంతపురం, కర్నూలు, సత్యసాయి జిల్లాలోని పశ్చిమ భాగాలలో భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: