అమరావతి : ‘యువ’మంత్రం వెనుక అసలు రహస్యమిదేనా ?

Vijaya


చంద్రబాబునాయుడు ఈమధ్య తరచూ యువమంత్రాన్ని జపిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్ధుల్లో 40 శాతం టికెట్లు యువతకే కేటాయిస్తానని పదే పదే చెబుతున్నారు. ఇక్కడ చంద్రబాబు ఉద్దేశ్యంలో యువతంటే బహుశా సీనియర్ల వారసులే అయ్యుండచ్చు. ఏదేమైనా యువతకు 40 శాతం టికెట్లు కేటాయించటమే నిజమైతే 70 సీట్లు యువత పోటీచేయాల్సుంటంది. మరన్ని సీట్లు నిజంగానే చంద్రబాబు యువతకు టికెట్లు కేటాయిస్తారా ?ఇక్కడే ఇంకో రహస్యం దాగుంది. అదేమిటంటే యువతంటే సీనియర్ల వారసులకే అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నది చంద్రబాబు ఆలోచనట. పార్టీలోని యువతేమో వారసులను కాకుండా మెజారిటి టికెట్లు కొత్తతరానికే కేటాయించాలని డిమాండ్లు చేస్తున్నారు. అయితే వీళ్ళ డిమాండ్లను చంద్రబాబు పట్టించుకునేట్లుగా కనబడటంలేదు. కారణం ఏమిటంటే కొత్తతరాన్ని ప్రోత్సహిస్తే వాళ్ళు గెలిచిన తర్వాత అవసరాలను దృష్టిలో పెట్టుకుని పార్టీలో నుండి జంప్ అయ్యే అవకాశముందని చంద్రబాబు భయపడుతున్నారట.ఎంతైనా పార్టీ ఫిరాయింపులకు పాల్పడటంలో ఆరితేరిన నాయకుడే కదా. తన పార్టీ తరపున గెలిచిన వారిలో ఎవరైనా పార్టీ ఫిరాయించే అవకాశముందని ఆలోచించారట. రేపటి ఎన్నికల్లో వైసీపీ-టీడీపీ మధ్య ప్రభుత్వం ఏర్పాటులో ప్రతిష్టంభన వస్తే అప్పుడు పార్టీలో నుండి కొందరు వైసీపీలోకి వెళ్ళిపోయే ప్రమాదముందని చంద్రబాబు ఆలోచించారట. అందుకనే యువతంటే సాధ్యమైనంతవరకు వారసులని మాత్రమే ప్రోత్సహించాలని డిసైడ్ అయ్యారట.రేపటి ఎన్నికల్లో ప్రతిష్టంభన వచ్చినా వారసులు వైసీపీ వైపు వెళ్ళే అవకాశాలు లేవని చంద్రబాబు నమ్ముతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కింజరాపు రామ్మోహన్ నాయుడు, చింతకాయల విజయ్, gopala krishna REDDY' target='_blank' title='బొజ్జల-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">బొజ్జల సుధీర్ రెడ్డి, పరిటాల శ్రీరామ్, మారుతి లాంటి వారసులు గెలిచి ఎలాంటి సమస్య వచ్చినా పార్టీని వదిలి వెళ్ళరనే ధైర్యంతో చంద్రబాబు ఉన్నారట. ఇలాంటి వారసులు+యువతను చంద్రబాబు రెడీ చేసుకుంటున్నట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి. ప్రతి జిల్లాలోను వారసులు కనీసం ఐదారుగురుంటారు. కాబట్టి నిజంగానే యువతకు టికెట్లివ్వాలని చంద్రబాబు అనుకుంటే 70 మందిని పోటీచేయించటం పెద్ద కష్టమేమీకాదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: