ప్రేమంటే ఇదేరా.. యువతీ చేసిన పనికి నెటిజన్లు ఫిదా?

praveen
ఇటీవల కాలం లో ప్రేమ అనేది ఒక కమర్షియల్ ఎలిమెంట్ గా మారి పోయింది అన్న విషయం తెలిసిందే. ఒకప్పుడు ప్రేమను ఒక మధురానుభూతిగా చూసేవారు. ప్రేమ లో పడినవారు ఈ లోకాన్ని మరిచి పోయేవారు.  ఇలా రెండు మనసుల మధ్య క్షణకాల వ్యవధిలో పుట్టిన ప్రేమ ఇక వందేళ్ల పాటు కలిసి ఆనందంగా జీవించగలం అనే నమ్మకాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఇకపోతే ఇటీవల కాలం లో మాత్రం కేవలం అవసరాలు తీర్చుకునేందుకు మాత్రమే ప్రేమ అనే ముసుగు వేసుకుంటున్నారు.

 అందమైన అమ్మాయిలు కావాలని అబ్బాయిలు.. బాగా డబ్బున్న అబ్బాయి కావాలని అమ్మాయిలు పక్కా ప్లానింగ్ తో ప్రేమ అనే నాటకం ఆడుతున్నారు. చివరికి వారి అవసరాలు తీరి పోయిన తర్వాత ప్రేమించిన వారికి ఎంతో సింపుల్ గా బ్రేకప్ చెప్పేస్తూ ఉన్న ఘటనలు కూడా ఎన్నో రోజుల్లో వెలుగు లోకి వస్తున్నాయ్ అని చెప్పాలి. అలాంటిది తాను ప్రేమించిన వాడికి అనారోగ్య సమస్యలు ఉన్నాయని లేవలేని స్థితి లో ఉన్నాడు అన్న విషయం తెలిసి కూడా పెళ్లికి అంగీకరించడం అంటే అది ఒక పెద్ద సాహసం అని చెప్పాలి.

 ఇక్కడ ఓ యువతీ ఇలాంటిదే చేసి అందరి మన్ననలు అందుకుంటుంది అని చెప్పాలి. ప్రేమించడం అనేది కేవలం టైంపాస్ మాత్రమే అయినా నేటి సమాజం లో యువతి చేసిన పని మాత్రం ప్రేమ అనే పదానికి సరైన అర్ధాన్ని తీసుకు వచ్చింది. తమిళనాడు వెల్లియుర్ కు చెందిన ప్రకాష్, దివ్య ఐదేళ్లుగా ప్రేమించు కుంటున్నారు. కష్టపడి కుటుంబాలను ఒప్పించి పెళ్లికి సిద్ధమయ్యారు. ఇంతలో ఒక యాక్సిడెంట్. దీంతో ప్రకాష్ వెన్నుముక దెబ్బతిని రెండు కాళ్లు చచ్చుబడి పోయాయి. దీంతో అతనితో పెళ్లి వద్దంటూ కుటుంబ సభ్యులు వారించిన ఆమె వినలేదు. చివరికి ప్రేమించిన వాడితోనే ఏడడుగులు నిలిచినడిచి చంటి పిల్లాడిలా అతన్ని చూసుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: