భూమా అఖిలప్రియకు నంద్యాల టికెట్ దక్కేనా ?

VAMSI
టీడీపీకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యలు చాలక... ఇప్పుడు కర్నూల్ జిల్లాలోని ఆళ్లగడ్డ మరియు నంద్యాల నియోగాజకవర్గాలలో కొత్త సమస్య మొదలైంది. ఇక్కడ రాజకీయ వారసత్వాన్ని తన తండ్రి భూమా నాగిరెడ్డి నుండి పుణికిపుచ్చుకున్న భూమా అఖిల్ ప్రియ రాజకీయాలలో సో సో గా లాగించేస్తోంది. కానీ ఇప్పటి వరకు తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని అటు పార్టీ అధిష్టానంలో కానీ ఇరు ప్రజల గుండెల్లోకానీ ఏర్పరుచుచుకోలేక పోయింది. ఈమె గతంలో టీడీపీ అధికారంలో ఉండగా మంత్రిగా చేసిన అనుభవం కూడా ఉంది. అప్పుడు ఆళ్లగడ్డ నియోజకవర్గం నుండి పోటీ చేశారు.
మొన్న జరిగిన ఎన్నికలలోనూ ఆళ్లగడ్డ నుండి చేసిన అఖిలప్రియ రానున్న ఎన్నికలలో మాత్రం నియోజకవర్గాన్ని మార్చడానికి వ్యూహాలు రచిస్తున్నట్లు కర్నూల్ టీడీపీ క్యాడర్ నుండి వినిపిస్తోంది. అయితే ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ముందు ముందు తెలియాల్సి ఉంది. ఆళ్లగడ్డ లో అయితే టీడీపీని ఓడించే బలమైన నేహా లేకపోవడం వలన అఖిల ప్రియ ఈజీగా గెలుస్తుంది.. సో చంద్రబాబుకు కూడా పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ నంద్యాల లో సీటు ఆశిస్తే టీడీపీ గెలుపు కష్టమే నాని అంతా అనుకుంటున్నారు. కాగా ఇందుకు చంద్రబాబు నాయుడు గెలుపు గుర్రాలని బరిలోకి దింపుతారు అని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే అఖిలప్రియ నంద్యాలలో ఆఫీస్ ను పెట్టుకుని వచ్చే ఎన్నికలకు రెడీ అవుతున్నారట.
ఈ విషయం తెలిసిన నంద్యాల నేతలు మాజీ మంత్రి ఎండి ఫరూక్ మరియు భూమా బ్రహ్మానంద రెడ్డి లు అలెర్ట్ అయ్యారట. ఇప్పటికే ఈ విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. కానీ టికెట్ విషయంలో ఈసారి చంద్రబాబు గట్టి నిర్ణయాలు తీసుకుంటారు అన్నది కొన్ని మీటింగ్ ల ద్వారా తెలుస్తోంది. ఇక నంద్యాల కాదుకదా.. ఆళ్లగడ్డలో అఖిలప్రియకు టిక్కెట్ ఇచ్చినా గెలుస్తుందా అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. దీనికి కారణం నియోజకవర్గంలో సొంత నాయకులతో సైతం తనకు మంచి సంబంధాలు లేవని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: