2024 ఎన్నికల్లో వైసీపీ ప్రధాన అజెండా... !

VAMSI
ఏపీలో ప్రస్తుతం ప్రధానంగా యాక్టీవ్ లో ఉన్నది నాలుగు రాజకీయ పార్టీలు మాత్రమే. వాటిలో ఒకటి అధికార పార్టీ వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ, బీజేపీ మరియు జనసేనలు... ఇంకా ఇవి మాత్రమే కాకుండా కొన్ని ప్రాంతీయ మరియు సిపిఎం సిపిఐ లాంటి పార్టీలు ఉన్న అంత ప్రాధాన్యత లేదని చెప్పాలి. గత ఎన్నికలలో అఖండ విజయం సాధించి వైసీపీ పాలనను కొనసాగిస్తోంది. అయితే నెక్స్ట్ ఎలక్షన్స్ కు ఇంకో ఒకటిన్నర సంవత్సరమా సమయం ఉండగా అన్ని రాజకీయ పార్టీలు తమ ప్రణాళికలలో తలమునకలైయున్నారు. అయితే దాదాపుగా అన్ని పార్టీల ప్రధాన లక్ష్యం వైసీపీని ఓడించడమే. దీనితో మరోసారి జగన్ కు ఎన్నికల సంగ్రామం తప్పేలా లేదు.
అయితే ఒకవైపు నవరత్నాలు తనను మళ్ళీ గెలిపిస్తాయని నమ్మకారంతో ఉన్నా, మరోవైపు భయంగానే ఉన్నాడు. కాగా ఈసారి ఎన్నికల మానిఫెస్టోగా రాష్ట్ర రాజధాని విషయాన్ని ప్రజల ముందుకు తీసుకె వెళ్ళడానికి సిద్ధం అవుతున్నాడు. మొదటి నుండి మూడు రాజధానుల విషయం మీద గట్టిగా ఉన్నాడు. కానీ ప్రతిపక్ష టీడీపీ మాత్రం దీనిని తిప్పి కొట్టడానికి ప్రయత్నాలు సాగిస్తోంది. ఇందుకు పూర్తి వ్యతిరేకంగా ఇప్పటికే రాజధానిగా ఉన్న అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలని పట్టుబడుతున్నారు. అయితే ఈ విషయాన్ని టీడీపీ ఎన్నికల్లో వాడుకోవడానికి ఎంతమాత్రం  ఉపయోగపడదని తెలుస్తోంది.  
కానీ ఇప్పటికీ మూడు రాజధానులను ప్రకటించిన తర్వాత జరిగిన తిరుపతి ఎంపీ మరియు ఆత్మకూరు ఎమ్మెల్యే అప్ ఎన్నికల్లో విజయ కేతనాన్ని ఎగురవేసింది వైసీపీ. దీనితో మూడు రాజధానులు ప్రజల సపోర్ట్ దొరికినట్లేనని వైసీపీ అంటోంది. కానీ ఈ అంశం ఏపీ ప్రజలకు సంబంధించి చాలా ముఖ్యమైంది. కాబట్టి పూర్తి ప్లానింగ్ తోనే ప్రజల ముందుకు వెళ్లడం మంచిదన్నది ప్రముఖులు అభిప్రాయం. అయితే వచ్చే ఎన్నికల్లో ఈ అంశం ఎంత వరకు కీలకం అవుతుంది అనేది ఇప్పుడే చెప్పలేము.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: